తెలంగాణ ప్రత్యేక కథనాలు

రహదారులతోనే అడవి బిడ్డల వికాసం…అటవీ ప్రాంతంలో రహదారుల ఏర్పాటుకు మంత్రి తుమ్మల చర్యలు..నుల ఆలస్యం పై అధికారులతో సమీక్ష….

Written by Mohiddin Shaik


అటవీ ప్రాంతంలో గిరిజనుల అభివృద్ధి రహదారుల అభివృద్ధితోనే ముడిపడి ఉందని రాష్ట్ర వ్యవసాయ మార్కెటింగ్ శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు… ఎల్ డబ్ల్యు ఈ , నిధులతో అటవీ ప్రాంతంలో వేయవలసిన రహదారులు కు సంబంధించి ఆయన అధికారులతో సమీక్ష నిర్వహించారు…

రహదారుల నిర్మాణానికి ఫారెస్ట్ క్లియర్ అంశంపై ముఖ్యమంత్రి కార్యాలయ అధికారులతో తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడారు… వివిధ శాఖలకు మంత్రిగా సుదీర్ఘకాలం పనిచేసిన తుమ్మల నాగేశ్వరరావు , తన పాలనా కాలంలో మారుమూల అటవీ గ్రామాలకు రహదారి సౌకర్యాలు ,వాగులు ఏరులపై వంతెనలు, కల్వర్టుల ఏర్పాటుకు విశేష కృషి చేశారు…

ఇప్పుడు రాష్ట్ర వ్యవసాయ మార్కెటింగ్ శాఖల మంత్రిగా ఉన్న ఆయన , ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతాల్లో మారుమూల గిరిజన గ్రామాలకు రహదారి సౌకర్యం కల్పించేందుకు కృషిని కొనసాగిస్తున్నారు…. అందులో భాగంగానే ఇదివరకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే వామపక్ష తీవ్రవాద ప్రభావిత ప్రాంతాల అభివృద్ధి నిధులతో చేపట్టిన పనులు, ఎక్కడ ఆగిపోయాయో , మళ్లీ అక్కడ నుంచి ప్రారంభించి , వేగంగా ఆయా పనులను పూర్తి చేసేందుకు ఆయన ప్రయత్నిస్తున్నారు.

గ్రామాలకు విద్యా వైద్యం మార్కెటింగ్ వ్యవసాయ రంగం లో అభివృద్ధికి రహదారులు శ్రీ రామ రక్ష అని,వాగులు వంకలు నదుల పై బ్రిడ్జి లు నిర్మాణం తో ఏజెన్సీ వాసులను ఆధునిక సమాజం వైపు అడుగులు వేసేలా అభివ్రుద్ది పనులు చేయాలనీ సంబంధిత అధికారులను మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశించారు.

..భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మొత్తం 76 పనులకు గాను 341 కోట్ల 26 లక్షలు మంజూరు అయ్యాయి.38 రోడ్లు 227 కిలోమీటర్లు నిడివి తో మొత్తం 38 బ్రిడ్జి ల నిర్మాణం సాగుతుంది.
ఫారెస్ట్ క్లియరెన్స్ లు లేక నిలిచిన పనుల పై మంత్రి తుమ్మల సీ.ఎం.వో ఉన్నత అధికారులతో మాట్లాడి, పనులు త్వరితగతిన పూర్తి అయ్యేలా అధికారుల కు ఆదేశాలు జారీ చేయాలని కోరారు..మంత్రి తుమ్మల చొరవ తో 7 రహదారులు 10 బ్రిడ్జి లకు ఫారెస్ట్ క్లియరెన్స్ లు రాగా ఆ పనులు త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
ఇంకా 25 పనులకు ఫారెస్ట్ క్లియరెన్స్ రావాల్సి ఉండగా ప్రిన్సిపల్ చీఫ్ కన్సర్వేటివ్ అఫ్ ఫారెస్ట్ అధికారి తో సీ.ఎం.వో అధికారులు మాట్లాడి త్వరిత గతిన అనుమతులు మంజూరు అయ్యేలా చూడాలని సూచించారు.

About the author

Mohiddin Shaik

Leave a Comment