జాతీయం తెలంగాణ ప్రత్యేక కథనాలు

పులకించిన లక్ష్మీపురం …పుట్టిన ఊరు, జన్మనిచ్చిన తల్లితండ్రుల పేరు, చరిత్రలో నిలిపిన ఘనుడు..అఖండ స్వాగతాలు, ఘన సన్మానాలతో ఉక్కిరి బిక్కిరి అయిన భట్టి విక్రమార్క..

Written by Mohiddin Shaik

ఉప ముఖ్యమంత్రి హోదాలో భట్టి విక్రమార్క రావడంతో తన సొంత గ్రామం స్నానాల లక్ష్మీపురం పులకించిపోయింది …పుట్టిన ఊరు, జన్మనిచ్చిన తల్లితండ్రుల పేరు, చరిత్రలో నిలిపిన ఘనుడు…, పేదల ఆశా కిరణం.. మధిర తో పాటు పాదయాత్రతో రాష్ట్ర ప్రజల హృదయాలు గెలిచిన జననేత… తండ్రి మల్లు అఖిలాండ, తల్లి మాణిక్యమ్మ కడుపున పుట్టిన ఆణిముత్యం…బట్టి విక్రమార్క… ఇంతింతై వటుడింతై అన్నట్లు రాజకీయంగా , అంచలంచెలుగా ఎదిగిన తీరును , వేలమంది పొగుడుతూ మా బట్టి ఉప ముఖ్యమంత్రి అయ్యాడు.. మల్లు అఖిలాండ , మాణిక్యమ్మ దంపతుల తనయుడు మన ఊరు పేరును దిగంతాలకు చాటాడంటూ స్నానాల లక్ష్మీపురం ప్రజలు విక్రమార్కను పొగడ్తలతో ముంచిత్తారు.. మా నాయకుడు మా బట్టి విక్రమార్క అంటూ గ్రామస్తులతో పాటు బంధు వర్గం ప్రేమాభిమానాలతో ఉక్కిరిబిక్కిరి చేశారు…

.

…..సొంత ఊరు అమ్మ ఒడి … తీపి ,చేదు జ్ఞాపకాల లోగిలి…

స్నానాల లక్ష్మీపురం లో మల్లు భట్టి విక్రమార్క ఇంటి వెనకాల వైరా నది… నది ఒడ్డున సీతారాముల గుడి… ఆ నదికి తూర్పు ఒడ్డున వారి సొంత పంట భూమి ..అందులో మామిడి తోట..

ఆ ప్రాంతానికి వెళ్ళగానే ఉపముఖ్యమంత్రి కి ఒక్కసారిగా తన బాల్యం అంతా గుర్తుకు వస్తుంది… అదే సందర్భంలో, ఆ నది ఒడ్డున మామిడి తోటలో తాను ప్రాణంగా ప్రేమించే తల్లి ,తండ్రి సమాధులు కూడా ఉన్నాయి… అందుకే ఆయన తన సతీమణి తన అన్ని విజయాల్లోనూ సగభాగమై నిలిచే మల్లు నందిని తో కలిసి మొదట సీతారాముల గుడిలో ప్రత్యేక పూజలు చేసి, నదికి తూర్పు ఒడ్డున మామిడి తోటలో ఉన్న దైవం తర్వాత అంతగా పూజించే, ప్రేమించే తన తల్లిదండ్రుల సమాధుల వద్ద ఘనంగా నివాళులర్పించి శ్రద్ధాంజలి ఘటించారు..

……..ఉప్పొంగిన అభిమానం……..

తాను ప్రాతినిధ్యం వహిస్తున్న మధిర నియోజకవర్గ ప్రజలతో పాటు, తాను పెరిగిన వైరా నియోజకవర్గ ప్రజలు కూడా బట్టి ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత తొలిసారిగా వచ్చిన సందర్భంగా పెద్ద ఎత్తున ఎదురేగి స్వాగతాలు పలికారు . పోటీపడి సన్మాన సత్కారాలతో ముంచేత్తారు ..తనను అంత పెద్ద ఎత్తున అభిమానిస్తున్న, ప్రేమిస్తున్న ప్రజలను చూసి ఆయన కూడా ప్రజల పట్ల ప్రేమ అభిమానం, భక్తి భావంతో కృతజ్ఞతలు , ధన్యవాదాలు తెలిపారు…

ఎదిగే కొద్ది ఒదిగే తత్వం కలిగిన భట్టి విక్రమార్క చిన్న , పెద్ద అందరితోనూ కలిసిపోయి తమ సొంత గ్రామంలో తమ వాళ్ళ అందరితోను కొద్ది సమయాన్ని ఆనందంగా గడిపారు. మీ అందరి ఆశీస్సులతోనే నేను ఇంత వాడినయ్యాను అంటూ బట్టి విక్రమార్క ప్రజలకు అభివాదం చేస్తూ, ప్రభుత్వ లక్ష్యాలను ప్రజలకు వివరిస్తూ శక్తి వంచన లేకుండా రాష్ట్ర అభివృద్ధి అన్ని రంగాల్లో జరిగే విధంగా కృషి చేస్తామని ఎన్ని అడ్డంకులు వచ్చినా ఇచ్చిన ఆరు గ్యారెంటీల వాగ్దానం అమలు చేసి తీరుతామని ప్రకటించారు.

గత ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా చేసినప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం అడ్డంకులను అధిగమించి సంపద సృష్టించి ఆ సంపదను నూరు శాతం ప్రజలకు పంచుతామని ఆయన పునరుద్ఘాటించారు. ఆదివారం మధ్యాహ్నం వరకు ఒకటిన్నర రోజుల ఖమ్మం జిల్లా తన పర్యటన ఉత్సాహభరితంగా పండుగ వాతావరణం లో జరిగింది ఆయన మధ్యాహ్నం తర్వాత సాయంత్రం మూడు గంటలకు ఖమ్మం చేరుకొని రాత్రి 7 గంటలకు బయలుదేరి హైదరాబాద్ వెళ్ళనున్నారు.

About the author

Mohiddin Shaik

Leave a Comment