ఆకాశంలో చిక్కిన ధరలను నేలకి దించే నాధుడే కనిపించడం లేదు..
ధరలను నియంత్రణ చేసే వ్యవస్థ చేతులెత్తేసిందా అనే అనుమానాలు కొందరు వ్యక్తం చేస్తున్నారు… మార్కెట్ మాయాజాలంలో సామాన్యుల బతుకులు చితికి పోతున్నాయి..

ధాన్యం ధర రైతు వద్ద కొనుగోలు చేసేటప్పుడు, ప్రభుత్వ మద్దతు ధరకు కొంచెం అటు ఇటుగా ఉంటుంది …కానీ ఆ ధాన్యం ద్వారా వచ్చే బియ్యం మాత్రం అనేక రెట్లు ధరలు పెరిగిపోతూ ఉంటాయి.. రైతు వద్ద కందులు కొనుగోలు చేసేటప్పుడు ప్రభుత్వం ఇచ్చే మద్దతు ధర మాత్రమే ఉంటుంది.. కందిపప్పు ధరలు మాత్రం ఏడాది తిరగకకు ముందే ఎన్నో రేట్లు పెరిగిపోతాయి.. పెసలు, మినుములు , సెనగలు ఇలా చెప్పుకుంటూ పోతే, పప్పు ధాన్యాలు, చిరుధాన్యాలు ,
ఇలా అన్నిటి ధరలు మార్కెట్ వర్గాల చేతుల్లోకి రాగానే, ఊహించని స్థాయిలో మారిపోతూ ఉంటాయి..
ఈ మార్కెట్ మాయాజాలం సామాన్యులకు ఎలాగూ అర్థం కాదు… డిమాండు సప్లై లో వచ్చే వ్యత్యాసాలను బట్టి ధరలు పెరుగుతాయి అనేది సాధారణమైన సూత్రం… కానీ అవసరానికి మించి నిల్వలు ఉండి కేంద్రానికి, లేదా ఇతర రాష్ట్రాలకు ఎగుమతులు చేసే ధాన్యం విషయంలో కూడా, ధాన్యం ధరను బట్టి నిర్ణయించే బియ్యం ధరలకు ఎంత మాత్రం పొంతన ఉండదు ..మరి ప్రజలను ఏలే మేధావులు వీటిపై నియంత్రణ ఎందుకు చేయలేకపోతున్నారనేది ప్రజల నుంచి వినిపిస్తున్న ప్రశ్న…
మరి ప్రజలను ఏలే మేధావులు వీటిపై నియంత్రణ ఎందుకు చేయలేకపోతున్నారనేది ప్రజల నుంచి వినిపిస్తున్న ప్రశ్న…
ఫైన్ క్వాలిటీ బియ్యం ధర పాత బియ్యం అయితే ఒక క్వింటా 6000 పైచిలుకు ధర నడుస్తోంది..
ఇక ప్రస్తుతం కొత్తగా వచ్చిన బియ్యం సైతం సాంబ మసూరి రకం 5000 అమ్ముతున్నారు. సాంబ మసూరి కొత్తగా వచ్చిన ధాన్యం రేటు క్వింటా అత్యధికంగా 2600 లకు కొనుగోలు చేసి మిల్లింగ్ చేస్తే 75 కిలోల బియ్యం వస్తాయి..
ఆ 75 కిలోల బియ్యం రేటు మార్కెట్లో రిటైల్ గా విక్రయించేది 3750 రూపాయలకు ఇస్తున్నారు. అంటే రైతు దగ్గర 2,600 లకు కొనుగోలు చేసిన ధాన్యం మిల్లు ఆడిస్తే వ్యాపారులు ఒక్క క్వింటా ధాన్యానికే 1000 రూపాయలు పైగా లాభాలు గడిస్తున్నారు.ఇందులో ట్రాన్స్పోర్ట్ , తరుగు ,ఇత్యాది ఖర్చులు తీసేసిన, భారీ లాభాలు పొందుతున్నారు. ఇది ప్రస్తుతం.. ఇదే బియ్యం నాలుగు నెలలు ఆపి మళ్లీ ధరను పెంచి విక్రయిస్తారు. దీనిపై నియంత్రణ చేస్తే వ్యాపారులకు కనీస లాభాలు వచ్చే విధంగా ,వినియోగదారుడు కి ధరలు నియంత్రణలో ఉంచి న్యాయబద్ధంగా ఉండేవిధంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.
ఇటీవల పౌరసరఫరాల శాఖ జరిపిన అధ్యయనంలో తీలిన కొన్ని నిత్యవసర వస్తువుల ధరలు వ్యత్యాసాలు పరిశీలిస్తే, గత సంవత్సరం కంటే కందిపప్పు ధర 50 శాతం పెరిగింది.. ఇక బియ్యం ధరలు 25 శాతం పెరిగాయి గత ఏడాది డిసెంబర్ నెలలో కిలో కందిపప్పు ధర 82 రూపాయల నుండి 105 రూపాయలు ఉండగా, ఈ సంవత్సరం ప్రస్తుత డిసెంబర్ లో అదే కందిపప్పు కిలో ధర 150 రూపాయలకు చేరింది . ఇక ఉల్లిగడ్డ ధర 27 రూపాయల నుంచి కిలో 46 రూపాయలకు చేరింది. కిలో ఎల్లిపాయలు ధర 350 రూపాయలు, ఇలా అన్ని రకాల నిత్యావసర వస్తువుల ధరలు అందనంత ఎత్తుకు చేరుకున్నాయి. వీటిపై ప్రభుత్వం తక్షణమే స్పందించి నియంత్రణలోకి తేవాలని పేద, మధ్యతరగతి ప్రజలు ముక్తకంఠంతో కోరుతున్నారు.
