క్రైమ్ వార్తలు జాతీయం

ఉలిక్కిపడ్డ పార్లమెంట్…సరిగ్గా 20 ఏళ్ల తర్వాత భారత పార్లమెంటులో మళ్ళీ అలజడి..పార్లమెంటు జరుగుతుండగా పొగ బాంబులు విసిరిన ఆగంతకులు..ప్రమాదం లేదని తెలిసి ఊపిరి పీల్చుకున్న ఎంపీలు…

Written by Mohiddin Shaik

భారత పార్లమెంటు భవనంలో బుధవారం జరిగిన సంఘటన పార్లమెంటు సభ్యులను ఉలిక్కిపడేలా చేసింది … పార్లమెంటు జరుగుతుండగానే ఇద్దరు ఆగంతకులు పబ్లిక్ గ్యాలరీ నుంచి దూకుకుంటూ తమ వద్ద ఉన్న పొగ బాంబులను విసిరారు …

దాంతో ఒక్కసారిగా సభలో ఏం జరుగుతుందో అర్థం కాక ప్రమాదం ఏదో ముంచుకొచ్చిందని అందులోని వారంతా తీవ్ర భయాందోళనకు గురయ్యారు … కొందరు పార్లమెంటు సభ్యులు ధైర్యం చేసి ఆగంతకులు ఇద్దరినీ పట్టుకొని పోలీసులకు అప్పచెప్పారు … అయితే ఆ పొగ వల్ల ఎటువంటి ప్రమాదము లేదని తెలిసిన తర్వాత వారంతా ఊపిరి పీల్చుకున్నారు …

…20 ఏళ్ల క్రితం పార్లమెంట్ పై జరిగిన ఉగ్రదాడి…

భారత పార్లమెంటుపై సరిగ్గా 20 ఏళ్ల క్రితం ఉగ్రదాడి జరిగిన విషయం తెలిసిందే.. 2001 డిసెంబర్ 13న భారత పార్ ఉగ్రవాదులు దాడి చేశారు అప్పట్లో పార్లమెంట్లోకి ప్రవేశించి ఆయుధాలతో దాడి చేశారు. ఆ సంఘటన అప్పట్లో తీవ్ర సంచలనం రేపింది. ఆ దాడిలో పాల్గొన్న ఐదుగురు ఉగ్రవాదులను పోలీసులు అప్పట్లోనే అరెస్టు చేశారు. ఆ అయిదుగురు ఉగ్రవాదు లు అఫ్జల్ గురు, షౌకత్ హుస్సేన్ , నవజ్యోతి, రహమాన్ , గీలాని వీరిని ఢిల్లీ పోటా కోర్టు రెండువేల రెండులో డిసెంబర్ 16న దోషులుగా తేల్చింది.

కాగా ఆ తర్వాత దేశ సర్వోన్నత న్యాయస్థానం ముగ్గురు నిందితు లు నవజ్యోతి, గిలాని, రెహమాన్ లను నిర్దోసులుగా తీర్పునివ్వడంతో విడుదల చేశారు. కాగా మిగిలిన ఇద్దరిపై శిక్ష కొనసాగుతుండగా, 2013 ఫిబ్రవరి 9వ తేదీన అఫ్జల్ గురువును తీహార్ జైల్లో ఉరిశిక్ష అమలు చేశారు.. ఇది పార్లమెంటుపై గతంలో జరిగిన ఉగ్రదాడి పూర్వపు చరిత్ర. అయితే ఇప్పుడు జరిగిన సంఘటనకు ఆనాటి ఉగ్రదాడికి ఏమైనా సంబంధాలు ఉన్నాయా అనే విషయాలు తెలియాల్సి ఉంది.

….. నియంతృత్వం చల్లదని నినాదాలు చేసిన ఆగంతకులు…

బుధవారం పార్లమెంటులో పొగ బాంబులు విసిరిన ఆగంతకులు , పార్లమెంటు బయట ఉండి ఆందోళన చేసిన మరో ఇద్దరు ఆగంతకులు నియంతృత్వం చెల్లదు అంటూ నినాదాలు చేశారు .. పార్లమెంటు లోపల అందరూ చూస్తుండగానే పొగ బాంబులు విసిరిన వ్యక్తి సాగర శర్మ మరో వ్యక్తి మనోరంజన్ గా పోలీసులు గుర్తించారు. అదేవిధంగా పార్లమెంట్ బయట అమూల్ షిండే నీలం అనే ఇద్దరు నినాదాలు చేస్తూ పోలీసులకు పట్టు పడ్డారు. వీరు బిజెపి ఎంపీ ప్రతాప్సింహ పేరుతో ఐడి కార్డులు పొంది పార్లమెంటులోకి వచ్చినట్లు పోలీసులు ప్రాథమిక దర్యాప్తులో తేల్చారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది..

.. భద్రతా లోపాలను బయటపెట్టిన సంఘటన..

సోమవారం జరిగిన సంఘటన అంత ప్రమాదకరమైంది కానప్పటికీ భద్రతా లోపాలను మాత్రం ఎత్తిచూపిందని పలువురు అంటున్నారు. అది మామూలు పొగ బాంబు కాబట్టి అందరూ క్షేమంగా ఉన్నారని అదే ఏ విషతుల్యమైన పొగ అయి ఉంటే భారీ ప్రమాదం సంభవించేదని అది భారత దేశ పార్లమెంటు చరిత్రలో అత్యంత విషాదకరంగమైన ఘటనగా మిగిలేదని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. ఇప్పటికైనా భద్రతను మరింత కట్టుదిట్టం చేయాలని ఎటువంటి లోపాలు లేకుండా సరిచేయాలని మేధావులు , సూచిస్తున్నారు.

About the author

Mohiddin Shaik

Leave a Comment