తెలంగాణ ప్రత్యేక కథనాలు రాజకీయం

అయ్యో.. భూస్వాములకు పంట సాయం రాదా..! రైతుబంధు నిధులు వస్తాయా …రావా… !ఫామ్ హౌస్ రైతుల్లో టెన్షన్….

Written by Mohiddin Shaik

వందల ఎకరాల భూస్వాములకు బడా ఫామ్ హౌస్ రైతులకు రైతుబంధు ఇక ఆగిపోనుందా..! అంటే ఆగి పోతుందనే సంకేతాలు కనిపిస్తున్నాయి..
రేవంత్ రెడ్డి సర్కారు వందల ఎకరాల భూములు కలిగిన భూస్వాములకు, ఫామ్ రైతులకు లేఅవుట్లు చేసి ప్లాట్లుగా అమ్మేసుకొని, ధరణిలో వ్యవసాయ భూమిగా చూపించుకొని , రైతు బంధు నిధులు , తినేసే వాళ్లకు చెక్ పెట్టనున్నారు…..అయితే ప్రస్తుత రాష్ట్ర మంత్రి అప్పటి ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రభుత్వం రైతుబంధు కింద ఇచ్చిన పంట సాయాన్ని తిరిగి ప్రభుత్వానికి చెల్లించారు. తాను పెద్ద రైతునని తనకు పంట సహాయం అక్కర్లేదని ఆయన ఆనాడే ప్రభుత్వానికి తిరిగి చెల్లించటం విశేషం..ఆ విధంగా ప్రభుత్వానికి తిరిగి చెల్లించిన పెద్ద రైతులు చాలా అరుదు.

పంటలు పండక అప్పుల పాలైన రైతులు ఆత్మహత్యలు చేసుకోకుండా వారిలో ధైర్యం కల్పించేందుకు కేసీఆర్ రైతుబంధు పథకాన్ని అమలు చేశారు..

ఆయన ఉద్దేశం మంచిదే, కానీ ఆ నిధుల్లో 80 శాతం నిధులు రాష్ట్రవ్యాప్తంగా 20 శాతం గా ఉన్న బడా భూస్వాములకు , ఫామ్ హౌస్ రైతులకు, రియల్టర్లకు వెళుతున్నాయని విమర్శ అసత్యం కాదు… ఉదాహరణకు బడ్జెట్లో 13 వేల కోట్లు రైతుబంధు కోస

కేటాయిస్తే అందులో నుంచి చిన్న సన్న కారు రైతులు, లేదా పది నుంచి 2కేటాయిస్తే అందులో నుంచి చిన్న సన్న కారు రైతులు, లేదా పది నుంచి 20 ఎకరాల లోపు రైతులకు ముట్టే సొమ్ము 20 నుంచి 30 శాతమే నట.. 70 శాతం నుంచి 80 శాతం వరకు నిధులు పంటతో సంబంధంలేని ,ఆత్మహత్య చేసుకునే కర్మ అసలే లేని, బడా రైతులు జేబుల్లోకి ఈ డబ్బు వెళుతోంది.. ఇందులో రాజకీయాలకు అతీతంగా అధికార పక్ష , విపక్ష అన్నిపక్షాలకు చెందిన రైతులు ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నారు….

…… కొత్త సర్కారు రైతుబంధు పై కటాఫ్ పెడుతుందా… !

రైతుబంధు లబ్ధిదారుల విషయంలో పది నుంచి 15 ఎకరాల లోపు రైతులకు మాత్రమే ఇచ్చే విధంగా కటాఫ్ పెట్టాలని అనేకమంది మేధావులు సూచిస్తున్నారు. దీనివల్ల బడ్జెట్లో కేటాయించే దాదాపు 6 నుంచి 7000 కోట్ల రూపాయలు ఆదా అవుతుందని, ఆ నిధులను నిజంగా అటు , భూమి యజమానికి కవులు చెల్లించలేక, చేసిన అప్పులు తీరక , ఆత్మహత్యలు చేసుకుంటున్న భూమిలేని కౌలు రైతులకు కేటాయిస్తే, ఆ పథకం యొక్క ఉద్దేశం నెరవేరుతుంది.

. …. బడా రైతులను పక్కన పెడితే చాలు రైతుబంధు ఇవ్వచ్చు….

రైతుబంధు లబ్ధిదారులకు కటాఫ్ పెట్టడం ద్వారా అదనంగా బడ్జెట్ కేటాయించాల్సిన అవసరం లేదని , ఆ బడ్జెట్ లోనే మిగిలే సొమ్ముతో ఆత్మహత్యలు చేసుకునే నిజమైన రైతులు , కవులు రైతులకు, చిన్న, సన్న కారు రైతులందరికీ న్యాయం చేయవచ్చని కొందరు సూచిస్తున్నారు. కొత్త ప్రభుత్వం ఈ రకమైన ఆలోచన చేస్తుందని అందుకు సంబంధించి ఇప్పటికే మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు సంకేతాలుగా కొంతమంది భావిస్తున్నారు

About the author

Mohiddin Shaik

Leave a Comment