తెలంగాణ ప్రత్యేక కథనాలు రాజకీయం

నేడు జిల్లాకు రానున్న మంత్రులు…ఆ ముగ్గురికి కేటాయించిన శాఖలు ఇవే..

Written by Mohiddin Shaik

ఖమ్మం జిల్లాకు చెందిన ముగ్గురు మంత్రులు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఈ ముగ్గురు మంత్రులు నేడు ఖమ్మం జిల్లాకు రానున్నారు.

ఎన్నికైన తర్వాత మంత్రులుగా ప్రమాణస్వీకారం చేసి తొలిసారి జిల్లాలో అడుగుపెడుతున్న సందర్భంగా కాంగ్రెస్ శ్రేణులు జిల్లా సరిహద్దు నాయకన్ గూడెం వద్ద భారీగా స్వాగతం పలికేందుకు సన్నహాలు చేస్తున్నారు. వారికి కేటాయించిన శాఖలు ఈ విధంగా ఉన్నాయి. మల్లు భట్టి విక్రమార్క ఆయనకు ఉప ముఖ్యమంత్రి హోదాతో పాటు ఆర్థిక , ఇందన శాఖలను కేటాయించారు. అదేవిధంగా తుమ్మల నాగేశ్వరరావుకు వ్యవసాయ శాఖ, చేనేత శాఖలను కేటాయించగా, పొంగులేటి శ్రీనివాసరెడ్డికి రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ తో పాటు సమాచార శాఖను కూడా కేటాయించారు.

ఆయా శాఖలకు మంత్రులుగా ప్రమాణం స్వీకారం చేసిన తరువాత శనివారం ప్రోటీన్ స్పీకర్ అక్బరుద్దీన్ ఓవైసీ చేత శాసన సభ్యులుగా శాసనసభ నియమాలను పాటిస్తామంటూ ప్రమాణస్వీకారం చేసి అనంతరం జరిగిన అసెంబ్లీ సమావేశంలో పాల్గొని వారు ఆదివారం ఖమ్మం జిల్లాలో పర్యటించేందుకు ముగ్గురు మంత్రులు మిగతా ఇద్దరు శాసనసభ్యులు డాక్టర్ మట్ట రాగమయి , మాలోతు రాందాస్ నాయక్ ఖమ్మం జిల్లాకు వస్తున్నారు

ఈ సందర్భంగా జిల్లా కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున స్వాగత కార్యక్రమాలను ఏర్పాటు చేశారు జిల్లా నలుమూలల నుంచి కాంగ్రెస్ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాలేరు నియోజకవర్గం పరిధిలోని నాయకన్ గూడెం వద్ద వారికి ఘన స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు చేశారు. సుదీర్ఘకాలం తర్వాత కాంగ్రెస్కు అధికారం రావడం జిల్లాలో దాదాపు 5 నియోజకవర్గాలకు గాను ఐదింటిలోనూ కాంగ్రెస్ అభ్యర్థులు గెలవడం అందులో ముగ్గురు మంత్రులు కావడం తదితర అంశాలతో కాంగ్రెస్ శ్రేణుల్లో ఫుల్ జోష్ కనిపిస్తోంది. వారితో పాటు కాంగ్రెస్కు మిత్రపక్షంగా ఉన్న సిపిఐ శ్రేణులు కూడా ఉత్సాహం ఉరకలేస్తుంది.

…. ఉమ్మడి జిల్లాలో పర్యటన వివరాలు..

ఆదివారం ఉదయం తొమ్మిది గంటలకు ఖమ్మం జిల్లా నాయకుని గూడెం వద్ద జిల్లాలోకి ప్రవేశిస్తారు
11 గంటలకు ఖమ్మంలోని జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో పాత్రికేయులతో మాట్లాడతారు. అనంతరం వారు అక్కడ నుండి 12 గంటలకు కొత్తగూడెం వెళతారు, కొత్తగూడెం నుండి సాయంత్రం నాలుగు గంటలకు భద్రాచలం చేరుకొని అక్కడ సీతారామచంద్రస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు పాల్గొంటారు, సాయంత్రం ఐదు గంటలకు భద్రాచలం నుంచి బయలుదేరుతారు

About the author

Mohiddin Shaik

Leave a Comment