తెలంగాణ ప్రత్యేక కథనాలు రాజకీయం

ఖమ్మం జిల్లా కు ఉప ముఖ్యమంత్రి తో పాటు రెండు మంత్రి పదవులు..!

Written by Mohiddin Shaik

అత్యంత ప్రతిష్టాత్మకంగా జరిగిన తెలంగాణ సాధారణ ఎన్నికల్లో ఖమ్మం జిల్లాలో ఐదు నియోజకవర్గాలకు ఐదు కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంది. ఇందులో సాక్షాత్తు ముఖ్యమంత్రి కేసీఆర్ పైనే సవాల్ చేసి నిలబడిన పొంగులేటి శ్రీనివాసరెడ్డి తో పాటు, మాజీ సీనియర్ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఖమ్మం నుంచి భారీ మెజారిటీతో విజయం సాధించారు.

ఖమ్మం జిల్లాకు ఉప ముఖ్యమంత్రి పదవితో పాటు మరో రెండు క్యాబినెట్ మంత్రి పదవులు దక్కుతాయని తెలుస్తోంది.. అత్యంత ప్రతిష్టాత్మకంగా జరిగిన తెలంగాణ సాధారణ అసెంబ్లీ ఎన్నికల్లో ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ పార్టీ ఐదు నియోజకవర్గాల్లోనూ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. సీఎల్పీ నేత బట్టి విక్రమార్క వాస్తవంగా ముఖ్యమంత్రి రేసులో ఉన్నప్పటికీ ఆయనకు ఉప ముఖ్యమంత్రి పదవి ఇస్తారని ప్రచారం జరుగుతోంది.

సిఎల్పీ నాయకుడు మండే ఎండల్లో రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్ర నిర్వహించి, కాంగ్రెస్ అధిష్టానం తో శభాష్ అనిపించుకున్న మల్లు భట్టి విక్రమార్క ఖమ్మం జిల్లా మధిర నుంచి విజయం సాధించారు. ఈ నేపథ్యంలో మల్లు భట్టి విక్రమార్క కు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా అవకాశం ఇస్తున్నట్లు వార్తలు వచ్చాయి.

ఇది ఇలా ఉంటే పాలేరు నుంచి విజయం సాధించిన పొంగులేటి శ్రీనివాసరెడ్డికి క్యాబినెట్ మంత్రిగా అవకాశం ఇస్తారని, ఖమ్మం నుంచి విజయం సాధించిన మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కు కీలక శాఖ మంత్రి పదవి దక్కుతుందనే ప్రచారం జరిగింది.

ముఖ్యమంత్రి తో పాటుగా ఉప ముఖ్యమంత్రి ల ప్రమాణస్వీకారం సోమవారం ఉంటుందని అందరూ భావించారు. కానీ అనూహ్యంగా వాయిదా పడటంతో మంగళవారం కానీ, లేదా బుధవారం కానీ ప్రమాణ స్వీకారం ఉంటుందని , కాంగ్రెస రాష్ట్ర నాయకత్వం ప్రకటించింది. మొత్తం మీద ప్రమాణస్వీకారం కొంత ఆలస్యం అయినప్పటికీ , ఖమ్మం జిల్లాకి తెలంగాణ నూతన ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రి తో పాటు మరో రెండు మంత్రి పదవులు దక్కటం ఖాయం అనే చర్చ జరుగుతోంది.

About the author

Mohiddin Shaik

Leave a Comment