దూసుకొస్తున్న తుఫాను రైతుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తోంది… ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం , ములుగు జిల్లాల పరిధిలో ప్రభుత్వం రెడ్ అలర్ట్ ప్రకటించింది. ఖమ్మం జిల్లాలో మంగళవారం అన్ని స్కూళ్లకు సెలవును కూడా జిల్లా కలెక్టర్ వి పి గౌతం ప్రకటించారు.

ఇదిలా ఉంటే ఆయా జిల్లాల్లో తుఫాను దెబ్బకు కోతకొచ్చిన వరి పడిపోయి , దిగుబడి ఘోరంగా పడిపోవడంతో పాటు ధాన్యం ధర కూడా పలకదని రైతులు పేర్కొంటున్నారు.
…. కన్నీళ్లు పెట్టుకుంటున్న సీడ్ మొక్కజొన్న రైతులు…
అంతర్జాతీయ స్థాయి మామ్ శాంతో ,సహా అనేక మొక్కజొన్న విత్తన కంపెనీలు జాతీయ స్థాయి మొక్కజొన్న విత్తన కంపెనీలు, ఖమ్మం జిల్లాలో దాదాపు పది నుంచి 15 వేల ఎకరాల్లో కొంతమంది రైతులతో మొక్కజొన్న పంట వేయించారు. మెయిల్ , ఫిమేల్ మొక్కజొన్నగా పిలిచే ఈ మొక్కజొన్న సరిగ్గా ఇప్పుడు సంపర్కం అయ్యే తరుణం లో పంట ఉందని రైతులు చెబుతున్నారు.
ఈ సమయంలో చిన్నపాటి వర్షం కురిసిన ఇక ఆ మొక్కజొన్న కంకులకు గింజ పట్టదని పూర్తిగా దెబ్బతినిపోయినట్లేనని రైతులు వాపోతున్నారు. ఖమ్మం జిల్లాలోని కొనిజర్ల మండలంలో పెద్ద ఎత్తున ఈ విత్తనాలకు సంబంధించిన మొక్కజొన్న పంటను రైతులు వేశారు. అదేవిధంగా వైరా , బోనకల్లు, సత్తుపల్లి డివిజన్లో కూడా పెద్ద ఎత్తున ఈ మొక్కజొన్నను రైతులు పండిస్తున్నారు.
అదే కౌలు రైతు కైతే కవులతో కలిపి ఎకరానికి 70,000 ఖర్చు వస్తుందని వారు పేర్కొన్నారు. ప్రస్తుతం వచ్చిన ఈ తుఫాను వల్ల పూర్తిగా ఆ పంట దెబ్బతిన్నట్లేనని, ఇక తమకు రూపాయి కూడా రాదని వారు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు.
వాతావరణం అనుకూలించి పంట సరిగ్గా పండితే ఎకరానికి 30 నుంచి 40 కింటాళ్ళ దిగుబడి వస్తుందని ప్రస్తుత తుఫాను వల్ల తాము పూర్తిగా నష్టపోయామని వారు పేర్కొంటున్నారు.
తమను ఇక ఆయా విత్తన కంపెనీలు గాని , లేదా ప్రభుత్వమే తమను ఆదుకోవాలని వారు వేడుకుంటున్నారు.ఈ సంవత్సరం నాగార్జునసాగర్ నిండకపోవడంతో సాగర్ ఆయకట్టు పరిధిలోని దాదాపు రెండు లక్షలకు పైగా ఎకరాల ఆయకట్టు పరిధిలో వరి నాట్లు పడలేదు. చెరువులు , కుంటలు, వాగులు, ఏరులు ఇతర బోరుబావుల ఆధారంగా వేసిన వరి పంట చేతికి వచ్చే సమయంలో తుఫాను, దెబ్బతీస్తోందంటున్నారు . తుఫాన్ హెచ్చరికలు ఆయా రైతులను తీవ్ర భయాందోళనకు గురిచేస్తున్నాయి. వరి పంటతో పాటు తుఫాను తీవ్రతను బట్టి మిర్చి ,పత్తి తదితర పంటలు కూడా దెబ్బతింటాయని రైతులు ఆందోళన చెందుతున్నారు.
