తెలంగాణ ప్రత్యేక కథనాలు రాజకీయం

ఎవరు గెలుస్తారు … ఎవరు ఓడిపోతారు..? పశువుల కాపరి నుంచి పండితుడి వరకు ఇదే చర్చ…

Written by Mohiddin Shaik

ఇప్పుడు తెలంగాణ లోని ప్రతి ఒక్కరిలోనూ ఎన్నికల ఫోబియా ఆవహించింది.. పశువులు కాపరి నుంచి పండితుడిదాకా ఎక్కడ పదిమంది కూడిన జరిగే చర్చ ఒక్కటే… ఈ ఎన్నికల్లో ఏ పార్టీ గెలుస్తుంది ఎవరు ఓడిపోతారు..

ఇంటికి చుట్టం వచ్చినా కుశల ప్రశ్నల కంటే ముందు మీ దగ్గర ఏ పార్టీ గెలుస్తుంది అని అడుగుతున్నారు.. వారి చర్చల్లోనే అసలైన నిజాలు తెలిసే అవకాశం ఉంది అంటారు…ఈసారి కాంగ్రెస్ గాలి తుఫాను మాదిరిగా వీస్తుంది అంటారు కొందరు.. హస్తం పార్టీ అధికారంలోకి వస్తుందని కూడా అంటారు..

. కొందరేమో లేదు లేదు మళ్లీ కారు కారు పార్టీ నే అధికారంలోకి వస్తుందంటారు.. అంతటితో ఆగకుండా అసలు ఆయా పార్టీలకు ఉన్న అనుకూల ప్రతికూల అంశాలపై కూడా చర్చిస్తున్నారు.. అసలు కాంగ్రెస్ వైపు గాలి బలంగా వీస్తుంది అన్న చర్చ ఇటీవల బాగానే వినిపిస్తోంది..

అసలు ఆ గాలి వట్టిదా గట్టిదా అనేది పక్కన పెడితే హస్తం పార్టీ గాలి వీస్తోందంటూ విస్తృత ప్రచారం చేసింది ఆ పార్టీ నాయకులు, వ్యూహకర్తలు కాదట.. మరి ఎవరు..అంటే సామాన్య ఓటరే నట…ఆ నోట, ఆ నోట , ఆ మాట విస్తృత చర్చలోకి వచ్చిందట..అందుకే ఆ మాటను ఒట్టి మాటని కొట్టి పారేయకుండా, కారు పార్టీ అధి నాయకత్వం గట్టిగానే ఎన్నికల పోరాటం చేయాలని కొందరు విశ్లేషకులు సూచిస్తున్నారు..

వివిధ మాధ్యమాల ద్వారా ప్రచారంలోకి వచ్చిన గాలి కంటే సామాన్య ఓటరు నుంచి వచ్చిన ఎన్నికల గాలి ప్రమాదం అని కొందరు విశ్లేషకులు అంటున్నారు.. అందుకే చిన్న శత్రువునైనా పెద్ద ఆయుధంతో కొట్టాలని సిద్ధాంతంతో కారు పార్టీ అధినాయకత్వం గట్టి పోరాటమే చేసిందంటున్నారు..

… కారు పార్టీకి ప్రతికూల అంశాలు ఏమిటి..

నిరుద్యోగుల్లో తీవ్ర వ్యతిరేకత .. ప్రభుత్వంలో విలీనం చేసిన ఆర్టీసీ ఉద్యోగుల్లో వ్యతిరేకత తగ్గలేదు.. విద్యా శాఖలో ఉద్యోగు లోను సానుకూలత కనిపించడం లేదు..
ఇల్లు లేని పేదవాడు నిరాశ చెందాడు..30 నుంచి 40 లక్షల వరకు ఉన్న కౌలు రైతు వ్యతిరేకంగా ఉన్నాడు. పెద్ద సంఖ్యలో ఉన్న వ్యవసాయ కూలీలు కాంగ్రెస్ ఇస్తానన్న 12,000 సాయం వైపు ఆకర్షింపబడుతున్నారు..బీసీ బందు, మైనారిటీ బందు వంటి పథకాలు వల్ల లాభం కంటే నష్టమే ఎక్కువ చేస్తాయని కొందరు విశ్లేషిస్తున్నారు..

అయితే ప్రజల్లో ఈ వ్యతిరేక అంశాలు కారు పార్టీని ఓడగొట్టేటంత స్థాయిలో పనిచేస్తాయా, లేక తమ వ్యతిరేకతను తెలియజేస్తూనే మరొకసారి కారు పార్టీని అధికారంలోకి తెస్తారా అనేది వేచి చూడాల్సి ఉంది..

.. హస్తానికి అధికారం వస్తుందని పెరిగిన ఆశలు..

ప్రస్తుతం అధికార కారు పార్టీకి ఉన్న ప్రతికూల అంశాలన్నీ తమకు అనుకూలిస్తాయని కాంగ్రెస్ భావిస్తోంది. రాష్ట్రంలో కాంగ్రెస్ గాలి వీధితోందన్న ప్రచారం తమకు అనుకూలిస్తుందని ఆ పార్టీ నేతలు నమ్ముతున్నారు. ఇల్లు లేని పేదలు డబల్ బెడ్ రూమ్ ఇల్లు వస్తుందని నమ్మకం వారిలో సన్నగిల్లిందని ఇందిరమ్మ ఇండ్లపై వారికి నమ్మకం ఉందని కాంగ్రెస్ నేతలు గట్టిగా చెబుతున్నారు,

రైతులకు రైతుబంధు, కౌలు రైతులకు కూడా 12000 వ్యవసాయ పెట్టుబడి, వ్యవసాయ కూలీలకు కూడా ఏడాదికి 12,000 ఆర్థిక సాయం వంటి పథకాలు గ్రామీణ రైతు కూలీలను ఆకర్షిస్తాయి అనే నమ్మకం కాంగ్రెస్ నేతల్లో కనిపిస్తోంది.ఇతర పార్టీల నుంచి అనేకమంది కాంగ్రెస్ పార్టీలో చేరడం కారు పార్టీకి ప్రత్యామ్నాయం హస్తం పార్టీ నే అనే భావన కలిగినందున ఇక తమకు అన్ని మంచి శకునాలే అని భావనలో కాంగ్రెస్ నేతలు ఉన్నారు.

ప్రస్తుత ఎన్నికల్లో పోటీకి నిలిపిన అభ్యర్థులు సైతం హేమాహేమీలను ఎంచి దించటం కూడా ఆ పార్టీలో ఆత్మవిశ్వాసాన్ని పెంచిందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. డబ్బు సంచులతో వచ్చి ఓట్లు కొంటున్నారు ఆ పార్టీ మంచిది కాదంటూ ఇరు ప్రధాన పార్టీల నాయకులు పరస్పరం ఆరోపణలు చేసుకుంటున్నప్పటికీ వాస్తవంలో డబ్బు పంచకుండా ఓటు పొందే అవకాశం లేదనే చర్చ అబద్ధం కాదు.

ఈసారి అధికార పార్టీ అభ్యర్థులకు దీటుగా ఖర్చు భరించగలిగే స్థాయి అభ్యర్థులను రంగంలోకి దించింది. కారు పార్టీ తయలాల కంటే హస్తం పార్టీ తగిలాలే ఓటర్ల చేతికి ముందుగా అందుతున్నట్లు పలుచోట్ల ప్రచారం జరుగుతుంది. వీటన్నిటినీ పరిశీలించినప్పుడు ఈసారి జరిగే ఎన్నికలు వారు వన్ సైడ్ అన్నట్టు జరిగే అవకాశం అసలే లేదు.

పలు సర్వే సంస్థలు ఇచ్చిన సర్వేల ప్రకారం ముఖ్యమంత్రి కుర్చీ బి ఆర్ ఎస్ అటు కాంగ్రెస్ కి దాదాపు సమ దూరంలోనే ఉంది అనే అనే చర్చ జరుగుతుంది. కాంగ్రెస్ నేతలు అగ్రనేతలు గంటపదంగా తమకు స్పష్టమైన మెజారిటీ వస్తుందని చెబుతున్నారు. ఇక రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా వచ్చేది మళ్లీ తమ ప్రభుత్వ మేనని గట్టిగా చెబుతున్నారు మరి ఎవరిని గెలిపిస్తారో ఎవరిని ఓడిస్తారో ఓటర్లు తేల్చాల్సి ఉంది.

About the author

Mohiddin Shaik

Leave a Comment