తెలంగాణ రాష్ట్రంలో ప్రజల ప్రజా పాలన రావాలని తెలంగాణ ప్రజలు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ కార్యదర్శి ప్రియాంక గాంధీ అన్నారు.

శనివారం ఆమె ఖమ్మం జిల్లాలోని ఖమ్మం పాలేరు సత్తుపల్లి మధిర నియోజకవర్గం లో రోడ్ షోలో పాల్గొని కాంగ్రెస్ రేణుల్లో నూతన ఉత్సాహాన్ని నింపారు. మధిరలో జరిగిన బహిరంగ సభలో ఆమె మాట్లాడుతూ కాంగ్రెస్ గాలిలో టిఆర్ఎస్ ప్రభుత్వం కొట్టుకుపోతుందని ఆమె పేర్కొన్నారు. సోనియా గాంధీ చెప్పిన 6 గ్యారంటీలను తమ ప్రభుత్వం రాగానే నూటికి నూరు శాతం అమలు చేసి తీరుతుందని ఆమె సభకు హాజరైన వేలాదిమంది ప్రజల హర్షద్వానాల మధ్య ప్రకటించారు. బట్టి విక్రమార్క ప్రాతినిధ్యం వహిస్తున్న మధిర నియోజకవర్గానికి వచ్చి సభ లో మాట్లాడటం తనకు ఎంతో సంతోషంగా ఉందని ప్రియాంక అన్నారు.

దేశంలోకెల్లా తెలంగాణ ప్రజలు అత్యంత రాజకీయ చైతన్యం కలిగిన వారని తమ నాయనమ్మ ఇందిరా గాంధీ చెప్పేవారని తన తల్లి సోనియా గాంధీ కూడా అదే మాట చెబుతారని ప్రియాంక అన్నారు. తన సోదరుడు రాహుల్ గాంధీ కన్యాకుమారి నుండి కాశ్మీర్ వరకు భారత్ జూడో యాత్ర చేశారని, మల్లు భట్టి విక్రమార్క కూడా తెలంగాణ రాష్ట్రంలో సుదీర్ఘమైన పాదయాత్ర చేశారని ఆ ఇద్దరి యాత్ర ఉద్దేశం ఒక్కటేనని అన్నారు.
తన తల్లి సోనియాతో మాట్లాడినప్పుడు మీరు ఎక్కడ ఉన్నారు అని అడిగితే హైదరాబాదులో ఉన్నాను రేపు ఖమ్మం జిల్లాకు వెళుతున్నాను అని చెప్పగా అక్కడ ప్రజలకు ఏమి చెబుతారు అని అడిగినట్లు పేర్కొన్నారు.
…. ప్రభుత్వం రాగానే ఉద్యోగాల భర్తీ..
ఖమ్మం జెడ్పీ సెంటర్ నుండి మయూరి సెంటర్ వరకు రోడ్డుకు ఇరువైపులా జనం కిక్కిరిసిపోయారు. అయితే ఆమె ఖమ్మం నగరంలో ప్రసంగించకుండా పాలేరు వెళ్లిపోవడంపై ప్రజలు ఒకింత నిరాశకు గురయ్యారు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఖమ్మం నుంచి పోటీ చేస్తున్న మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రియాంకతో పాటు ఆమె వాహనంపై రోడ్ షోలో పాల్గొన్నారు కాంగ్రెస్ పార్టీని శ్రీనివాసరెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఆమె పిలుపునిచ్చారు. సత్తుపల్లి నియోజకవర్గం కల్లూరు సభలో మాట్లాడుతూ గిరిజన ఆదివాసీలకు అటవీ భూములపై హక్కులు కల్పిస్తామని అన్నారు. జల్ జమీన్ జంగిల్ వీటిపై గిరిజన ఆదివాసులకు సర్వహక్కులు కల్పిస్తామని అన్నారు.
…. ఒక్క కేసీఆర్ కాదు 100 మంది వచ్చినా మధిరను తాకలేరు …..బట్టి విక్రమార్క
ఇటీవల మధురలో ముఖ్యమంత్రి కెసిఆర్ సభ పెట్టారని ఆ సభకు ప్రియాంక సభకు వచ్చిన జనంలో సగం మంది కూడా లేరని బట్టి విక్రమార్క అన్నారు. కానీ కేసీఆర్ మాట్లాడుతూ ఇక్కడ బట్టి గెలవడు ఆయన ఏమీ కాదు అని వ్యాఖ్యలు చేయడంపై బట్టి తీవ్రంగా స్పందించారు. మధురలో తనను ఓడించటానికి ఒక్క కేసీఆర్ కాదు 100 మంది కేసీఆర్ లు వచ్చిన తనను ఓడించలేరని మధిర పోరాటాల గడ్డాన్ని ఇక్కడ రైతాంగ సాయుధ పోరాట యోధులు నడయాడిన మధిరలో రాజకీయ చైతన్యం ఉందని ఆయన అన్నారు. ప్రజల అండదండలు తనకు ఉన్నత కాలం తనను ఓడించటం సాధ్యం కాదని అన్నారు.
