జాతీయం తెలంగాణ రాజకీయం

నేడు జిల్లాలో ప్రియాంక గాంధీ పర్యటన…ఏర్పాట్లు చేస్తున్న కాంగ్రెస్ నేతలు

Written by Mohiddin Shaik

నేడు ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ నాయకురాలు ప్రియాంక గాంధీ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పర్యటనకు రానున్నారు. శుక్రవారం సాయంత్రం ఆమె కొత్తగూడెం పట్టణంలో జరిగే రోడ్ షోలో పాల్గొని ప్రసంగిస్తారు. ఆ నియోజకవర్గంలో నుంచి కాంగ్రెస్ సిపిఎం బలపరిచిన సిపిఐ అభ్యర్థి కోణంనేని సాంబశివరావును గెలిపించాలని ఆమె ప్రజలకు విజ్ఞప్తి చేయనున్నారు.సాంబశివరావు విజయాన్ని కాంక్షిస్తూ ఆమె పట్టణంలో రోడ్ షో నిర్వహిస్తున్నారు.

శుక్రవారం రాత్రికి ఖమ్మం చేరుకుంటారు ఖమ్మంలోనే ఆ రాత్రికి బస చేసి శనివారం ఉదయం ఆమె వైరా, ఖమ్మం పాలేరు నియోజకవర్గాల్లో జరిగే భారీ రోడ్ షోలో పాల్గొని ఆమె ప్రసంగిస్తారు.

పర్యటన వివరాలు ఇలా ఉన్నాయి…

24, 25 తేదీలలో ఎన్నికల ప్రచార సభలలో పాల్గొననున్న ప్రియాంక…24 న మధ్యాహ్నం 12:00 గంటలకు పాలకుర్తి ,1:30 గంటలకు హుస్నాబాద్ ,అక్కడి నుండి సాయంత్రం 3:00 గంటలకు కొత్తగూడెం ప్రచార సభలలో పాల్గొననున్న ప్రియాంక…24 న ఖమ్మంలో రాత్రి బస చేయనున్న ప్రియాంక…25 న 11:00 గంటలకు ఖమ్మం,పాలేరు , 1:30 కి సత్తుపల్లి ,2: 40 నుండి 3:30 వరకు మధిర ప్రచార సభలలో పాల్గొననున్న ప్రియాంక…అక్కడి నుండి విజయవాడకు చేరుకొని గన్నవరం ఎయిర్పోర్ట్ నుండి ఢిల్లీకి బయలుదేరి వెళతారు.

About the author

Mohiddin Shaik

Leave a Comment