పాలేరు నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని అఖండ మెజార్టీతో గెలిపించాలని సిపిఐ జాతీయ సమితి నాయకులు చాడ వెంకటరెడ్డి సిపిఐ రాష్ట్ర సమితి నాయకులు మహమ్మద్ మౌలానా ప్రజలకు పిలుపునిచ్చారు. బుధవారం రాత్రి వారు పొంగిలేటితో కలిసి ఖమ్మం రూరల్ మండలంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. దేశంలో బిజెపిని ఓడించడానికి రాష్ట్రంలో నియంతృత్వ ధోరణిని అనుసరిస్తున్న బి.ఆర్.ఎస్ ప్రభుత్వాన్ని ఓడించడానికి సిపిఐ కాంగ్రెస్ పార్టీతో కలసి ఎన్నికల్లో పోటీ చేస్తోందని వారు తెలిపారు.

ముఖ్యంగా సిపిఐ శ్రేణులు పొత్తుల్లో భాగంగా శ్రీనివాసరెడ్డి గెలుపు కోసం పాలేరు నియోజకవర్గంలో సైనికుల పనిచేయాలని వారు సూచించారు. కొత్తగూడెంలో కాంగ్రెస్ కార్యకర్తలు సిపిఐ కార్యకర్తలు కలిసికట్టుగా అక్కడ పోటీ చేస్తున్న సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కోణాలేని సాంబశివరావు ను గెలిపించేందుకు కృషి చేస్తున్నారని వారు పేర్కొన్నారు.
ఉమ్మడి జిల్లాలో పది స్థానాల్లోనూ సిపిఐ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం కష్టపడి పని చేయాలని వారు తెలిపారు. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రజాదరణ కలిగిన నాయకుడని ఆయన నిత్యం ప్రజల్లో ఉంటూ ప్రజల కోసం పనిచేసే గొప్ప నాయకుడని చాలా వెంకటరెడ్డి అన్నారు. అటువంటి నాయకుడిని ప్రజలు గెలిపించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.
ఇదిలా ఉంటే సిపిఐ జిల్లా సమితి నాయకులు దండి సురేష్ నేతృత్వంలో వరంగల్ క్రాస్ రోడ్ లో సిపిఐ కార్యకర్తల ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించి పొంగులేటి విజయానికి కృషి చేయాలని కార్యకర్తలకు సూచించారు. ఖమ్మం రూరల్ మండలం తో పాటు పాలేరు నియోజకవర్గంలో సిపిఐ కి ఓటు బ్యాంకు ఉంది.
