తెలంగాణ ప్రత్యేక కథనాలు

తుమ్మలను ఆశీర్వదించిన ప్రొఫెసర్ హరగోపాల్…ఖమ్మంలో మేధావుల అసదస్సుకు హాజరైన మానవ హక్కుల నేత..

Written by Mohiddin Shaik

పౌర హక్కులు, మానవ హక్కులకు ఎక్కడ భంగం కలిగినా, తన గళాన్ని వినిపించే ప్రొఫెసర్ హరగోపాల్ ఖమ్మం కాంగ్రెస్ అభ్యర్థి మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావును ఆశీర్వదించారు. ప్రజాస్వామ్య హక్కుల కోసం నిరంకుశ పాలకులకు వ్యతిరేకంగా ప్రజలను చైతన్యపరిచే కార్యక్రమంలో భాగంగా ఏర్పడిన తెలంగాణ పీపుల్స్ జాయింట్ యాక్షన్ కమిటీ కన్వీనర్ గా ఆయన ఉన్నారు, హరి గోపాల్ ఆదివారం ఖమ్మం వచ్చారు.

ఖమ్మంలో జరిగే మేధావుల అవగాహన సదస్సులో ఆయన పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ప్రొఫెసర్ హరగోపాల్ ను మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెళ్లి మర్యాదపూర్వకంగా ఆయనను కలుసుకొని, ఆయన ఆశీస్సులు పొందారు. ఈ సందర్భంగా హరిగోపాల్ మాట్లాడుతూ ప్రజాస్వామ్య విలువలు నానాటికి పడిపోతున్నాయని, నియంత్రత్వ , పోకడలు పెరిగిపోతున్నాయని , ఇటువంటి తరుణంలో ప్రజాస్వామ్యం విలువలను కాపాడే శక్తులు బలపడాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. నియంత్రత్వ పాలకులపై ప్రజాస్వామ్యక శక్తులు గెలవాలని ఆయన ఈ సందర్భంగా ఆకాంక్షించారు

నియంత కెసిఆర్ ను విభేదించి, ఆ పార్టీని వీడి కాంగ్రెస్లో చేరి ఖమ్మం నుంచి పోటీ చేస్తున్న సందర్భంగా తుమ్మలను ఆయన అభినందించారు.. హరగోపాల్ ను కలిసిన వారి లో మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ మాజీ రైతుబంధు సమితి కన్వీనర్ నల్లమల వెంకటేశ్వరరావు తదితరులు ఉన్నారు.

About the author

Mohiddin Shaik

Leave a Comment