ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాజకీయం

సత్తుపల్లి నియోజకవర్గంలో తుమ్మల పొంగిలేటి ప్రచారం..మట్ట రాగమయిని గెలిపించాలంటూ విజ్ఞప్తి

Written by Mohiddin Shaik

మాజీ మంత్రి ఖమ్మం కాంగ్రెస్ అభ్యర్థి తుమ్మల నాగేశ్వరరావు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రచార కో కన్వీనర్ మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సత్తుపల్లి నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. పెనుబల్లి మండలం లోని ఒక మామిడి తోటలో ఏర్పాటుచేసిన ఆత్మీయ సమ్మేళనంలో వారు పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ గాలి వీధితోందని ఈ గాలిలో బి ఆర్ ఎస్ పార్టీ కొట్టుకొని పోవడం ఖాయం అని అన్నారు.

ఇప్పుడు జరుగుతున్న ఎన్నికలు అహంకారానికి అభిమానానికి మధ్య జరుగుతున్నాయని తుమ్మల అన్నారు. ఇందిరమ్మ రాజ్యం వస్తుందని సోనియమ్మ ఇచ్చిన 6 గ్యారంటీలు కచ్చితంగా అమలు జరుగుతాయని ఆయన తెలిపారు. డాక్టర్ మట్ట రాగమయి దయానంద్ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేశారని ఆమెను భారీ మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు నిత్యం ప్రజా జీవితంలో ఉండి స్వచ్ఛందంగా సేవా కార్యక్రమాలు అందిస్తున్న మట్ట రాగమయి కి ప్రజలు అండగా నిలవాలని ఆయన కోరారు.

పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ కల్వకుంట్ల కుటుంబం అహంభావంతో వ్యవహరిస్తుందని ప్రజా సమస్యలను పట్టించుకోలేదని విమర్శించారు వచ్చే ఎన్నికల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి ఆ పార్టీ ఒక్క సీటు కూడా గెలుచుకోలేదని ఆయన పేర్కొన్నారు. మట్ట రాగమయిని భారీ మెజారిటీతో గెలిపించాలని ఆయన కోరారు.

సత్తుపల్లి నియోజకవర్గంలో పలు కార్యక్రమాల్లో పాల్గొన్న వారిద్దరూ అశ్వరావుపేట నియోజకవర్గంలోని దమ్మపేటలో జరిగిన ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్నారు ఆ కార్యక్రమానికి భారీ సంఖ్యలో ప్రజలు హాజరయ్యారు అక్కడ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న జారే ఆదినారాయణ గెలిపించాలని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

About the author

Mohiddin Shaik

Leave a Comment