తెలంగాణ ప్రత్యేక కథనాలు

భద్రాద్రి జిల్లాలో కేటీఆర్ సుడిగాలి పర్యటన…నాలుగు నియోజకవర్గాల్లో రోడ్డు షో నిర్వహించనున్న నేత…

Written by Mohiddin Shaik

బి ఆర్ ఎస్ పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షులు తాజా మాజీ మంత్రి కేటీ రామారావు ఆదివారం భద్రా కొత్తగూడెం జిల్లాలో సుడిగాలి పర్యటన చేయనున్నారు. జిల్లాలోని నాలుగు నియోజకవర్గాల్లో ఆయన రోడ్ షోలో పాల్గొంటారు.

ఉదయం 11 గంటలకు భద్రాచలం రోడ్ షోలో కేటీఆర్ పాల్గొని ప్రసంగిస్తారు. ఆ తరువాత మధ్యాహ్నం ఒంటిగంటకు ఇల్లందు పట్టణంలో రోడ్ షో నిర్వహిస్తారు. ఆ తరువాత మధ్యాహ్నం రెండున్నర గంటలకు కొత్తగూడెంలో జరిగే రోడ్ షో లో ఆయన పాల్గొని ప్రసంగిస్తారు.

అదేవిధంగా అక్కడి నుంచి సాయంత్రం నాలుగు గంటలకు అశ్వారావుపేట చేరుకొని అక్కడ రోడ్ షో లో పాల్గొని కేటీఆర్ ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు తమ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని ఆయన ఓటర్లను కోరనున్నారు.

About the author

Mohiddin Shaik

Leave a Comment