తెలంగాణ రాజకీయం

లౌకిక పాలన బి ఆర్ఎస్ కే సాధ్యం..రేవంత్ రెడ్డి ఆర్ఎస్ఎస్ భావజాలం..పువ్వాడ అజయ్ కుమార్ ను భారీ మెజారిటీతో గెలిపించండితాజా మాజీ హోం మంత్రి మహమూద్ అలీ

Written by Mohiddin Shaik

తెలంగాణ రాష్ట్రం వచ్చాక మత కలహాలు లేవని అచ్చమైన లౌకిక పరిపాలన కెసిఆర్ కె సాధ్యమని తాజా మాజీ హోం మంత్రి మహమూద్ అలీ అన్నారు. ఖమ్మంలో పువ్వాడ అజయ్ కుమార్ ను భారీ మెజారిటీతో గెలిపించడం ద్వారా మరొకసారి కెసిఆర్ ముఖ్యమంత్రి అయ్యే అవకాశం కల్పించాలని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

గురువారం ఖమ్మం బి ఆర్ ఎస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పరిపాలనలో నిత్యం మత కలహాలు జరిగేవని ఆ తరువాత ఢిల్లీ నుంచి వచ్చే కాంగ్రెస్ పెద్దలు బాధితులకు బియ్యం సరుకుల సంచి ఇచ్చి చేతులు దులుపుకునేవారు అని ఆయన ఆరోపించారు.

రాష్ట్రంలో గంగ జమున తహజీబ్ విధానంతో అన్ని మతాలు కలిసి సమున్నతమైన జీవన విధానాన్ని కొనసాగించే విధంగా పరిపాలన సాగుతోందని ఆయన పేర్కొన్నారు. రంజాన్ వచ్చిన, క్రిస్మస్, బతుకమ్మ, సంక్రాంతి ఇలా ఏ పండుగ వచ్చినా అది ప్రభుత్వ పండుగ ఆనందంగా జరుపుకుంటున్నామని ఆయన గుర్తు చేశారు.

… రేవంత్ రెడ్డి ది ఆర్ఎస్ఎస్ భావజాలం…

కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మొదట ఆర్ఎస్ఎస్ లు పని చేశారని, ఆయన ఆ భావజాలం తోనే చంద్రబాబు నాయుడును మిస్ గైడ్ చేసి గతంలో తెలుగుదేశం పార్టీ బిజెపితో పొత్తు పెట్టుకునే విధంగా చేశారని ఆరోపించారు. నిజమైన లౌకికవాది మంచి పరిపాలన అధ్యక్షుడు కేసీఆర్ మాత్రమేనని ఆయన పేర్కొన్నారు. 24 గంటలు రైతులకు సైతం కరెంటు అందిస్తున్న దేశంలోనే ఏకైక రాష్ట్రం తెలంగాణ అని అన్నారు. రైతు భీమా రైతు బంధు, వంటి పథకాలతో రైతుల్లో ధైర్యం నింపారని, కాలేశ్వరం వంటి భారీ ప్రాజెక్టులతో సహా అనేక నీటి ప్రాజెక్టులు నిర్మించడం ద్వారా పంటల దిగుబడి అనేక రెట్లు పెంచారని ఆయన అన్నారు.

… మైనారిటీ గురుకులాలు 1300 ఏర్పాటు..

మైనారిటీల అభివృద్ధి కోసం వారి పిల్లలు ఉన్నత చదువులు చదవాలనే ఉద్దేశంతో రాష్ట్రంలో 13 మైనారిటీ గురుకులాలను నిర్మించిన ఘనత కేసిఆర్ కే దక్కుతుందని అన్నారు. ఇందుకోసం 3200 కోట్లు ఖర్చు చేసినట్లు ఆయన తెలిపారు. ఉమ్మడి రాష్ట్రంలో గత పాలకులు 10 ఏళ్లలో ముస్లిం మైనారిటీల సంక్షేమానికి ఐదు కోట్ల 40 లక్షలు ఖర్చు చేస్తే, కెసిఆర్ ప్రభుత్వం తొమ్మిది సంవత్సరాల్లో కేవలం షాదీ ముబారక్ పథకం కింద రెండు లక్షల 77 వేల మంది అమ్మాయిల పెళ్లిళ్లకు మూడు వేల రెండు వందల కోట్లు ఖర్చు చేశారని ఆయన చెప్పారు

…. కరీంనగర్లో నా మాటలను వక్రీకరించారు..

కరీంనగర్లో తాను మీడియాతో మాట్లాడుతూ కేసీఆర్ తెలంగాణ తెచ్చిన వ్యక్తిగా తెలంగాణ మహాత్మా తాను చెబుతూ హజరత్ ఉమర్ ఫారూఖ్ రాజి అల్లాహుతాలా మాదిరి మంచి పరిపాలన అందించే స్వప్నం కలవాలని తాను చెప్పగా కెసిఆర్ ను ఖలీఫా తో పోల్చినట్టు కొందరు మీడియాలో ప్రచురించారని చెప్పారు. తాను అలా అనలేదని అయినప్పటికీ ఎవరికైనా ఆ మాటలు బాధ కలిగిస్తే తాను మనస్ఫూర్తిగా క్షమాపణ వేడుకుంటున్నానని మహమూద్ అలీ ప్రకటించారు.

About the author

Mohiddin Shaik

Leave a Comment