ప్రత్యేక కథనాలు వాతావరణం వ్యవసాయం

రైతుల్లో ఆశలు రేపుతున్న ఎండుమిర్చి ధర… క్వింటా ఏసి మిర్చి 24,500 రూపాయలు.. మరోపక్క నీళ్లు లేక సాగర్ ఆయకట్టు వరి పంట..

Written by Mohiddin Shaik

పెరిగిన ఎండుమిర్చి ధర మిర్చి రైతుల్లో ఆశలు రేకెత్తిస్తోంది.. అయితే రైతులు మార్కెట్కు మిర్చి తీసుకొచ్చేనాటికి ఈ ధర ఉంటుందో లేదో తెలియదు.. కానీ ప్రస్తుతానికి ఏసి ఎండుమిర్చి ధర ఒక క్వింటా 24,500 రూపాయలు పలికింది.. ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో బుధవారం జెండా పాటగా ఈ ధరను నిర్ణయించారు.

. కొత్తగా పండించిన మిర్చి ధర మాత్రం రెండు రోజుల క్రితం కంటే బుధవారం 1100 తగ్గి 22 వేల నూట పదమూడు రూపాయలుగా నిర్ణయించారు..

…. వర్షాభావ పరిస్థితులతో ఎండుతున్న పంటలు..

నాగార్జునసాగర్ ఎడమ కాలువ పరిధిలో దాదాపు 8 లక్షల ఎకరాల ఆయకట్టు సాగు అవుతుంది. అందులో నల్లగొండ, సూర్యాపేట, ఉమ్మడి ఖమ్మం జిల్లాతో పాటు కొంత ఆయకట్టు కృష్ణాజిల్లా పరిధిలో కూడా సాగుతోంది. ఖమ్మం జిల్లాలో దాదాపు 1,35 వేల హెక్టార్లకు పైగా సాగర్ పరిధిలో సాగు అవుతుంది. ఈ సంవత్సరం ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని సాగర్ ఆయకట్టు రైతులు వరి పంట ఎండిపోయి తీవ్ర నష్టానికి గురి అవుతున్నారు.సాగర్ జలాలతో స్థానికంగా ఉన్న చెరువులు, కుంటలు నింపుకొని ఆయా కుంటల పరిధిలో ఉన్న డిస్ట్రిబ్యూటరీ విధానంతో వేలాది ఎకరాలు పంటలు సాగుతున్నాయి.

వర్షాలతో వర్షాకాలం ప్రారంభంలో చెరువు కుంటలు నిండినందున కొంతవరకు ఒరిసాగు జరుగుతున్నప్పటికీ , అనేక వేల ఎకరాల్లో వరి ఈనిన తరువాత గింజ పట్టే తరుణంలో, నీటి తడి లేక ఎండిపోతుండటంతో తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వాగులు, ఏరులు, బోర్ల ద్వారా చెరువులు కుంటల పరిధిలో ఉన్న తక్కువ ఆయకట్టు ప్రాంతాల్లో ఒరిసాగు మాత్రం పూర్తిస్థాయిలో జరుగుతోంది. అతి ఎక్కువ ఖర్చుతో సాగు చేసేది మిర్చి పంట . మిర్చి పంటకు సరైన ధర పలుకుతుండటంతో మిర్చి రైతులు వకింత ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కానీ నీటి కోసం మాత్రం రైతాంగం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

About the author

Mohiddin Shaik

Leave a Comment