తెలంగాణ రాజకీయం

బిజెపిలోకి రాకుంటే ఇబ్బందులు , తప్పన్నారు భయపడలేదు..ఐటీ దాడులు బి ఆర్ ఎస్, బిజెపి కుట్ర… బిజెపికి బీఆర్ఎస్ కు రిటర్న్ గిఫ్ట్ ఇస్తాం..రూల్స్ ను అతిక్రమించిన అధికారులు దోషులవుతారు.. మీడియాతో పొంగులేటి సంచలనం వ్యాఖ్యలు..

Written by Mohiddin Shaik

బిజెపిలోకి రాకపోతే మీకు ఇబ్బందులు తప్పవని ఒక ఎంపీ ఒక స్లిప్పుపై ఏఏ ఇబ్బందులు వస్తాయో రాసి నాకు ఇచ్చారు… అయినా భయపడలేదు నా ప్రజలు అభిప్రాయం ఎటు ఉంటే అటే వెళ్తానని చెప్పా…

టిఆర్ఎస్ విధానాలకు వ్యతిరేకంగా స్వరం పెంచిన నాటి నుంచే నాపై నా అనుకున్న వాళ్లపై అక్రమ నిర్బంధాలు ఇబ్బందులు కేసులు మొదలయ్యాయి… ప్రస్తుతం జరిగిన ఐటీ దాడులు బిజెపి బిఆర్ఎస్ కుట్రలో భాగమే… ఐటీ బృందం ఐటి రూల్స్ కు వ్యతిరేకంగా మా అల్లుడు పై చేయి చేసుకున్నారు మా అకౌంటెంట్ ని థర్డ్ డిగ్రీ ప్రయోగించారు ఈ ప్రభుత్వాలు శాశ్వతం కాదు…

త్వరలో ప్రభుత్వాలు మారతాయి రూల్స్ ను అతిక్రమించిన అధికారులు కూడా దోషులుగా నిలబడాల్సి వస్తుంది… అయినా బిజెపి బీఆర్ఎస్ పెట్టే ఇబ్బందులకు భయపడేది లేదు… వీటన్నిటికీ కలిపి ఈ ఎన్నికల్లో కేసీఆర్ ప్రభుత్వానికి రిటర్న్ గిఫ్ట్ ఇస్తాం బిఆర్ఎస్ ను ఓడించి కాంగ్రెస్ని అధికారంలోకి తెచ్చేదాకా ఎన్ని ఇబ్బందులు అయినా ఎదుర్కొంటాం…

సీఎం కేసీఆర్ కుటుంబం తమపై పెడుతున్న ఇబ్బందులు, నిర్బంధాలు, అన్నింటికీ కలిపి ఈ ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు రిటర్న్ గిఫ్ట్ కింద బి ఆర్ఎస్ను ఓడిస్తారని కాంగ్రెస్ ను అధికారంలోకి తెస్తారని కాంగ్రెస్ తెలంగాణ కో కన్వీనర మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు.
శుక్రవారం ఖమ్మం లోని తన నివాసంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ అభ్యర్థులు, కొత్తగూడెం నుంచి సిపిఐ అభ్యర్థి కోణంనేని సాంబశివరావు విజయం సాధిస్తారని ఆయన పేర్కొన్నారు.
కొత్తగూడెంలోని కాంగ్రెస్ పార్టీ శ్రేణులు , తన అభిమానులు అందరూ కలిసికట్టుగా పనిచేసి సిపిఐ అభ్యర్థిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఆయన పిలుపునిచ్చారు.

…. బిజెపిలో చేరకపోతే ఇబ్బందులు వస్తాయంటూ ఒక ఎంపీ నాకు ఉత్తరం ఇచ్చారు…

బిజెపికి భయపడే ప్రసక్తే లేదు .
ఆ పార్టీలో చేరమని ఒత్తిడి తెచ్చినప్పుడు ప్రజల అభిమానికి వ్యతిరేకంగా నేను రాలేనని చెబితే, ఆ రోజుల్లోనే ఒక ఎంపీ ఒక చిన్న స్లిప్పుపై మీరు పార్టీలో చేరకపోతే, ఈ ఈ రకాల ఇబ్బందులు పడతారంటూ బెదిరించినప్పటికీ తాను లెక్క చేయలేదని , లెక్కచేయబోనని ఆయన పాత్రికేయులు అడిగిన ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.

….. ఐటీ రూల్స్ అతిక్రమిస్తే అధికారులు కూడా దోషులవుతారు…

ఐటీ అధికారులు వారి పరిధిని దాటి వ్యక్తులను భయభ్రాంతులకు గురి చేయడం, వారిపై భౌతికంగా దాడి చేసి కొట్టడం నిబంధనలకు విరుద్ధమని పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. తన బావమరిదిపై అధికారులు చేయి చేసుకున్నారని, కొట్టారని ఆయన పేర్కొన్నారు. ఈ ప్రభుత్వాలు శాశ్వతం కాదని కొద్ది రోజుల్లో ప్రభుత్వాలు మారిపోతే రూల్స్ ను అతిక్రమించిన అధికారులు కూడా దోషులుగా నిలబడాల్సి వస్తుందని ఆయన హెచ్చరించారు.సిపిఐ జిల్లా కార్యదర్శి పోటు ప్రసాద్ మాట్లాడుతూ బీజేపీ ఇటువంటి ఐటీ దాడులు ఎన్నికల సందర్భంలో బెంగాల్ , త్రిపుర , కర్ణాటక వంటి రాష్ట్రాల్లో చేసిందని ఆయా రాష్ట్రాల్లో బిజెపి ఘోరంగా ఓడిపోయిందని గుర్తు చేశారు . తెలంగాణలో కాంగ్రెస్ ఇతర ప్రతిపక్ష నాయకుల పై ఐటి దాడులు చేసి భయపెట్టిన ప్రయోజనం లేదని ఇక్కడ టిఆర్ఎస్ , బిజెపి ఓడిపోవడం ఖాయమని అన్నారు.

About the author

Mohiddin Shaik

Leave a Comment