కాంగ్రెస్ నేత పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి నివాసం ముందు కాంగ్రెస్ కార్యకర్త ఒంటిపై కిరోసిన్ పోసుకొని ఆత్మహత్యకు యత్నించడం గురువారం రాత్రి సంచలనం రేపింది.
మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గత రెండు రోజుల క్రితం మరో మూడు రోజుల్లో తనపై మాజీమంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పై ఐటి దాడులు జరుగుతాయని కీలకమైన వ్యాఖ్యలు చేశారు.. సరిగ్గా ఆయన చెప్పినట్లే గురువారం తెల్లవారుజామునే ఐటి అధికారుల బృందం పోలీసు బందోబస్తుతో పొంగులేటి నివాసాలు హైదరాబాదు ఖమ్మం నారాయణపురం ఇతర ప్రాంతాల్లో ఉన్న 30 చోట్ల ఏకకాలంలో ఐటి సోదాలు జరుగుతున్నాయి. పొంగులేటి ముందుగానే ఐటీ దాడులు గురించి వ్యాఖ్యానించటం పై ఆసక్తికర చర్చ జరుగుతోంది.


ఇటీవల పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ లోకి చేరిన తరువాత ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి బి ఆర్ ఎస్ అభ్యర్థులను ఒక్కరిని కూడా అసెంబ్లీ గేటు తాకనివ్వనని శపధం చేసిన విషయం తెలిసింది. దానిపై ముఖ్యమంత్రి కేసీఆర్ ఖమ్మంలో జరిగిన సభల్లో అన్ని సభల్లోనూ కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేశారు. అదే సందర్భంలో మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పై కూడా ముఖ్యమంత్రి విమర్శలు చేయగా తుమ్మల నాగేశ్వరరావు ముఖ్యమంత్రి కేసీఆర్ పై ఘాటు విమర్శలు చేశారు.
ఈ నేపథ్యంలోనే తమ ఇద్దరిపై ముఖ్యమంత్రి కేంద్ర ప్రభుత్వంతో కలిసి కుమ్మక్కై ఐటి దాడులు చేస్తారని పొంగులేటి ముందుగానే ఊహించి వ్యాఖ్యలు చేశారు. ఆయన ఊహించినట్లే దాడులు జరుగుతున్నాయి. ఈ దాడులను రాజకీయ కుట్రగా అభివర్ణిస్తూ సీఎల్పీ నాయకుడు బట్టి విక్రమార్క ఖండించారు. నామినేషన్లు వేసే సమయంలో ఐటీ దాడులు చేయడం దారుణమని ఆయన పేర్కొన్నారు. ఏ రాష్ట్రంలో ఎన్నికలు జరిగినా ఎన్నికల సమయంలో ప్రతిపక్ష పార్టీలపై ఐటి దాడులు చేయడం కేంద్రంలోని బిజెపికి అలవాటుగా మారిందని ఆయన వ్యాఖ్యానించారు.
…. తన అల్లుడు పై ఐటి అధికారులు దాడి …
తన అల్లుడు పై దాడి చేసి కొట్టారని పొంగిలేటి ఆరోపించారు
తనను తన సిబ్బంది బంధువులను ఎన్ని ఒత్తిడిలకు గురిచేసిన లొంగేది లేదని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు… ఇదిలా ఉంటే గురువారం రాత్రి పొంగులేటి నివాసం ఎదుట కాంగ్రెస్ కార్యకర్త ఒంటిపై పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యకు యత్నించాడు పక్కనే ఉన్న వారు చూసి అతనిని అడ్డుకున్నారు.
