తెలంగాణ రాజకీయం

సత్తుపల్లి మత్తు వదిలిందా…జన సంద్రాన్ని తలపించిన హస్తం పార్టీ శ్రేణులు ..హోరెత్తించిన టిఆర్ఎస్ మోటార్ సైకిల్ ర్యాలీ…నామినేషన్ రోజే మొదలైన అంచనాలు..

Written by Mohiddin Shaik

నామినేషన్ల సందర్భంగా గురువారం సత్తుపల్లి లో జరిగిన కాంగ్రెస్ ర్యాలీ జనసంద్రాన్ని తలపించిందని పలువురు అంటున్నారు.. వరద మాదిరిగా పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ శ్రేణులు హాజరై ర్యాలీగా వెళుతున్న దృశ్యాలు వీడియోలో చూసిన కొందరు సత్తుపల్లి మత్తు వదిలింది అంటూ వ్యాఖ్యలు చేశారు.

కాంగ్రెస్ సత్తుపల్లి అభ్యర్థిని డాక్టర్ మట్ట దయానంద్ సతీమణి రాగమయి గురువారం నామినేషన్ వేస్తున్న సందర్భంగా కాంగ్రెస్ శ్రేణులు పెద్ద సంఖ్యలో హాజరై సత్తుపల్లి పట్టణంలో మూడు రంగుల జండాలతో కదం తొక్కారు. ఇక బి ఆర్ ఎస్ అభ్యర్థి సండ్ర వెంకట వీరయ్య నామినేషన్ సందర్భంగా ఆ పార్టీ శ్రేణులు మోటార్ సైకిల్ ర్యాలీతో పట్టణంలో దుమ్మురేపారు. వెంకట వీరయ్య ఖమ్మం ఎంపీ బి ఆర్ ఎస్ పార్లమెంటరీ పార్టీ నాయకుడు నామా నాగేశ్వరరావు రాజ్యసభ సభ్యుడు బండి పార్థసారథి రెడ్డి వెంట రాగా అట్టహాసంగా ఆయన నామినేషన్ వేశారు.రెండు ప్రధాన పార్టీల ర్యాలీలు నామినేషన్లతో సత్తుపల్లి పట్టణం ఆయా పార్టీల జెండాలతో నినాదాలతో కోలాహలంగా కనిపించింది..

… నామినేషన్ రోజే మొదలైన అంచనాలు..

నామినేషన్లకు వచ్చిన జనం ఊపు ను బట్టి కొందరు గెలుపు ఓటములను అప్పుడే అంచనాలు వేస్తున్నారు. డాక్టర్ మట్ట రాగమయి గెలుపు ఖాయమని నామినేషన్ కు హాజరైన జన సందోహమే చెబుతుందంటూ కొందరు విశ్లేషిస్తుండగా మరికొందరు మరొకసారి సండ్ర వెంకట వీరయ్య గెలుస్తారని అంటున్నారు. మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో అటు తుమ్మల నాగేశ్వరరావు అనుచరులు అభిమానులు ఇటు పొంగిలేటి శ్రీనివాసరెడ్డి అభిమానులు అనుచరులు కాంగ్రెస్ అభ్యర్థికి సంపూర్ణ మద్దతుతో ఆమె విజయం ఖాయమని కొందరు విశ్లేషిస్తున్నారు

పదేళ్లుగా టిఆర్ఎస్ ప్రభుత్వం పై ఉన్న వ్యతిరేకత కొంతవరకు కాంగ్రెస్కు కలిసొస్తుందని, ప్రజల్లో మంచి ఆదరణ కలిగిన మట్ట దయానంద్ కుటుంబం నుంచి అభ్యర్థి రంగంలో ఉండటం వల్ల వారికి ప్రజల మద్దతు పెద్ద ఎత్తున ఉంటుందని వారు విశ్లేషిస్తున్నారు. కాగా సండ్ర వర్గీయులు తమ ప్రభుత్వం చేసిన అభివృద్ధి తమ నాయకుడిని గెలిపిస్తే గెలిపిస్తుందని వారు పేర్కొంటున్నారు మొత్తం మీద గురువారం జరిగిన ర్యాలీలో విషయానికి వచ్చినప్పుడు కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో వచ్చారని కొందరు పేర్కొంటున్నారు గెలుపు ఓటములు తేలాలంటే ఎన్నికలు అయ్యేదాకా ఆగాల్సిందే..

About the author

Mohiddin Shaik

Leave a Comment