సీఎల్పీ నాయకుడు బట్టి విక్రమార్క గురువారం మదిర, లో తన నామినేషన్ పత్రాలను సమర్పించారు. అంతకుముందు ఆయన వైరాలోని తన స్వగృహం నుంచి కుటుంబ సమేతంగా బయలుదేరి వైరా

స్వామి అయ్యప్ప ఆలయంతో పాటు షిరిడి సాయినాధుని ఆలయంలో కూడా నామినేషన్ పత్రాలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు అదేవిధంగా తమ జన్మస్థలమైన స్నానాల లక్ష్మీపురం లోని రామాలయంలో కూడా ఆయన నామినేషన్ పత్రాలకు ప్రత్యేక పూజలు చేయించి ఆయా దేవాలయాల్లో వేద పండితులచే ఆశీర్వచనాలు పొందారు అనంతరం ఆయన మధిర బయలుదేరి వెళ్లి అక్కడే రిటైనింగ్ అధికారికి తన నామినేషన్ పత్రాలను అందజేశారు

ఈ సందర్భంగా మధిర పట్టణంలో కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున ఆయన నామినేషన్ సందర్భంగా హాజరయ్యారు బట్టి విక్రమార్క ఈ సందర్భంగా పెద్ద ర్యాలీ నిర్వహించారు ఈ ర్యాలీలో నియోజకవర్గంలోని వివిధ గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ కార్యకర్తలు హాజరయ్యారు.. బట్టి సీఎం అంటూ నినాదాలు మారుమోగాయి..
