సీఎం కేసీఆర్ కి సవాళ్లు విసిరిన పొంగులేటి శ్రీనివాసరెడ్డి , మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు లపై ఐటి దాడులు జరగబోతున్నాయా… ఆ ఇద్దరినీ గులాబీ బాస్ టార్గెట్ చేస్తున్నారా..?
మంగళవారం పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.. మూడు రోజుల్లో తమపై ఐటి దాడులు జరగబోతున్నాయి అంటూ శ్రీనివాసరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేసినట్లు సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి… ఆ వ్యాఖ్యలపై రాజకీయ వర్గాల్లో విస్తృతంగా చర్చ జరుగుతుంది.
…. దాడుల విషయం ముందుగా ఎలా తెలిసింది…
ఐటీ దా డులు జరుగుతాయని పొంగులేటి శ్రీనివాసరెడ్డి ముందుగా ఊహిస్తున్నారా , లేక నిజంగానే ఐటీ దాడులు జరగబోతు ఉంటే ముందస్తు సమాచారం , ఎలా తెలుస్తుంది , అనే అంశంపై చర్చ జరుగుతోంది.
సహజంగా ఐటీ దాడులు ఎక్కడ జరిగిన ముందస్తు సమాచారం లీక్ కాకుండా పకడ్బందీగా జరుగుతాయి.
… దాడుల తర్వాత తెలుస్తుంది అహంకారం ఎవరిదో…
దాడులు జరగబోతున్నాయి అని చెప్పిన పొంగులేటి, ఐటీ దాడుల తర్వాత అహంకారం ఎవరిదో ప్రజలు అర్థం చేసుకుంటారని అన్నారు. అహంకారం నాదా, లేక కల్వకుంట్ల కుటుంబాన్నిదా, ప్రజలు తెలుసుకుంటారని ఆయన పేర్కొన్నట్లు వార్తలు వచ్చాయి..
కావాలని తమపై ఉద్దేశపూర్వకంగా ఐటీ దాడులకు దిగితే , తాము న్యాయస్థానాలను ఆశ్రయిస్తామని, ప్రజలు అన్ని విషయాలను గమనిస్తారని పొంగులేటి పేర్కొన్నారు. ఐటీ దాడులకు వత్తు డులకు భయపడేది లేదని అన్నారు. .
