తెలంగాణ రాజకీయం

ప్రజా పందా మద్దతు కోరిన తుమ్మల నాగేశ్వరరావు…సానుకూలంగా స్పందించిన పోటు రంగారావు…బలాన్ని కూడా కట్టుకుంటున్న కాంగ్రెస్ అభ్యర్థి..

Written by Mohiddin Shaik

మాజీ మంత్రి, కాంగ్రెస్ ఖమ్మం నియోజకవర్గ అభ్యర్థి తుమ్మల నాగేశ్వరరావు సోమవారం సిపిఐ ఎంఎల్ ప్రజా పంథా నేతలను కలుసుకొని వారి మద్దతు కోరారు. ఆ పార్టీ జిల్లా కార్యాలయానికి వెళ్లి ప్రజాపంథా రాష్ట్ర నాయకులు సీనియర్ నేత పోటు రంగారావును, జిల్లా అధ్యక్షులు వెంకటేశ్వరరావును ఆయన ప్రత్యేకంగా కలుసుకొని , ఈ ఎన్నికల్లో బిఆర్ఎస్ ను, బిజెపిని ఓడించటానికి తనకు మద్దతునివ్వాలని కోరారు.

దానికి ఆ పార్టీ నేతలు సానుకూలంగా స్పందించినట్లు సమాచారం . , ఆ రెండు పార్టీలను ఓడించే శక్తులకు తమ పార్టీ మద్దతునిస్తుందని వారు సమాధానం చెప్పినట్లు తెలిసింది
ముఖ్యమంత్రి సైతం ప్రధాన దృష్టి సారించిన ఖమ్మం నియోజకవర్గంలో మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తో తలపడుతున్న మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్ని వర్గాల ప్రజలను కలుసుకొని బలాన్ని కూడగట్టుకుంటున్నారు.

ఇప్పటికే ఆయన ముస్లిం సంఘాలను, వివిధ చర్చిల్లో జరిగిన కార్యక్రమాల్లో పాల్గొని క్రైస్తవ సంఘాలను కలుసుకొని వారి మద్దతు కోరారు. కార్పొరేషన్ పరిధిలో ఉన్న పలువురు వీఆర్ఎస్ కార్పొరేటర్లు సైతం తుమ్మల సమక్షంలో కాంగ్రెస్లో చేరిన విషయం తెలిసిందే. మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, టిఆర్ఎస్ ఖమ్మం నగర మాజీ అధ్యక్షుడు మురళి తో సహా కొంతమంది తుమ్మలతో కాంగ్రెస్ లో చేరిన విషయం తెలిసింది.

ఇటీవల చంద్రబాబు నాయుడు తాత్కాలిక బెయిల్ పై బయటకు వచ్చిన సందర్భంలో తుమ్మల నాగేశ్వరరావు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి వెళ్లి అక్కడ సంబరాలు జరుపుకుంటున్న తెలుగుదేశం పార్టీ శ్రేణులను ఉద్దేశించి ప్రసంగించారు. ఆ సందర్భంలోనే తెలుగుదేశం పార్టీలో తాను నిర్వహించిన పాత్ర వారందరికీ చెబుతూనే ఈ ఎన్నికల్లో తనకు మద్దతుగా నిలవాలని తనను గెలిపించేందుకు పనిచేయాలని వారందరికీ విజ్ఞప్తి చేశారు. దానికి తెలుగుదేశం శ్రేణుల నుంచి కూడా సానుకూలమైన స్పందన వచ్చింది.

అనేక కుల సంఘాలను, వృత్తిదారుల సంఘాలను, చివరకు రిటైర్మెంట్ తీసుకున్న ఉద్యోగులను ఆయన ప్రత్యేకంగా కలుసుకొని వారి మద్దతును కూడగట్టుకుంటున్నారు. సోమవారం సిపిఐ ఎంఎల్ ప్రజా పంథా పార్టీ నేతలు కలిసి మద్దతు కోరడం ద్వారా వారు మద్దతునిస్తామని హామీ ఇవ్వడం ద్వారా తుమ్మల నగరంలో కొంత పట్టు బిగించే ప్రయత్నం చేసినట్లు పరిశీలకులు భావిస్తున్నారు.

అనేక కుల సంఘాలను, వృత్తిదారుల సంఘాలను, చివరకు రిటైర్మెంట్ తీసుకున్న ఉద్యోగులను ఆయన ప్రత్యేకంగా కలుసుకొని వారి మద్దతును కూడగట్టుకుంటున్నారు. సోమవారం సిపిఐ ఎంఎల్ ప్రజా పంథా పార్టీ నేతలు కలిసి మద్దతు కోరడం ద్వారా వారు మద్దతునిస్తామని హామీ ఇవ్వడం ద్వారా తుమ్మల నగరంలో కొంత పట్టు బిగించే ప్రయత్నం చేసినట్లు పరిశీలకులు భావిస్తున్నారు.
… తుమ్మల చేరికతో స్థానిక కాంగ్రెస్ పార్టీలో ఆదిలో కొంత విభేదాలు తలెత్తినప్పటికీ వాటిని ఆ పార్టీ అధినాయకత్వం పరిష్కరించినట్లు కనిపిస్తోంది. నగరంతో సహా నియోజకవర్గంలోని అన్ని ప్రాంతాల్లో కాంగ్రెస్ శ్రేణులు కూడా విభేదాలు ప్రదర్శించకుండా ప్రచారంలో కలిసి వస్తుండటం కూడా తుమ్మల వర్గంలో కొంత ఉత్సాహం నింపినట్లు కొందరు పేర్కొంటున్నారు.

About the author

Mohiddin Shaik

Leave a Comment