తెలంగాణ రాజకీయం

పేరుగాంచిన పెద్ద సైకోలు నన్ను సైకో , అంటే ఎలా..! ఈ సైకోల కోసం ఖమ్మంలో ఒక పిచ్చాసుపత్రి కట్టించాలి… మీడియా సమావేశంలో పువ్వాడ అజయ్ చలోక్తులు…

Written by Icon News

సీఎం సభ సందర్భంగా రక్షణ పరంగా అడ్డుగా ఉన్న అరుగును తొలగించాం… సీఎం సభ కాగానే తిరిగి అక్కడే మళ్ళీ అరుగు నిర్మించేందుకు లక్ష రూపాయలు కళాశాల అకౌంట్లో డిపాజిట్ చేశాం.. ఆ వివరాలను ఎన్నికల సంఘానికి కూడా తెలిపాం… ఈ విషయం తెలియక కొంతమంది నేను సైకోనని వాకింగ్కు వెళ్లే వారి కూర్చునే అరుగును కూల్చానని నోటికొచ్చిన దుష్ప్రచారం చేస్తున్నారు… నేను సైకోను కాదు నాకంటే పెద్ద సైకోలు ఇక్కడ చాలామంది ఉన్నారు. వీరి వ్యవహార శైలి చూస్తుంటే ఖమ్మంలో ఒక పిచ్చాసుపత్రి అర్జెంటుగా కట్టించాల్సి ఉందని అనిపిస్తుంది… బాబ్రీ మసీదు కూల్చింది కాంగ్రెస్ పాలనలోనే వారి నిర్లక్ష్యం వల్ల బిజెపి అధికారంలో ఉన్న రాష్ట్రంలో ఆ సంఘటన జరిగింది… వారు తిరిగి వెంటనే కట్టించే ఒక అరుగు గురించి ఓట్ల కోసం సైకో లాగా దుష్ప్రచారం చేస్తున్నారు… ఖమ్మంలో ఇసుక మాఫియా ఉందంటూ ఊదరగొడుతున్నారు ఎక్కడ గోదావరి ఉందా…కృష్ణ నది ఉందా.. ఉన్న మున్నేరులో రాళ్లు రప్పలు తప్ప ఇసుక ఉండదనే విషయం ఇక్కడ ప్రజలందరికీ తెలుసు.. అంటూ తాజా మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కాంగ్రెస్ నేతలు తుమ్మల నాగేశ్వరరావు ఇతర నాయకుల పై పేర్లు పెట్టకుండా వ్యంగ్యంగా విమర్శనాస్త్రాలు సంధించారు..

ఈనెల 5వ తేదీ ఆదివారం ఖమ్మం లోని సర్దార్ పటేల్ స్టేడియంలో ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ పాల్గొననున్న ప్రజా ఆశీర్వాద సభను విజయవంతం చేయాలని అజయ్ కుమార్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. గడచిన తొమ్మిదేళ్లలో ఖమ్మం నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి గురించి ఆయన వివరించారు. సభను విజయవంతం చేయాలని ఆయన విజ్ఞప్తి చేస్తూ కాంగ్రెస్ నాయకులు కాంగ్రెస్ అభ్యర్థి తుమ్మల నాగేశ్వరరావు తనపై చేస్తున్న దుష్ప్రచాలను ఖండించారు. సీఎం సభలకు ప్రజలు వస్తున్న తీరును గమనించి పెద్ద గ్రౌండ్లో సభను ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన చెప్పారు.

… కాంగ్రెస్ మైండ్ గేమ్ ఆపకపోతే గుణపాఠం తప్పదు. మేయర్ నీరజ…
మేయర్ డిప్యూటీ మేయర్ కాంగ్రెస్లో చేరబోతున్నారంటూ ఆ పార్టీ నేతలు మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు నాయకత్వంలో చేస్తున్నాం మైండ్ గేమ్ ప్రచారాన్ని ఆపకపోతే తగిన గుణపాఠం ప్రజలు చెబుతారని నగర మేయర్ పి నీరజ హెచ్చరించారు. ఆమెతో పాటు డిప్యూటీ మేయర్ కూడా మీడియాతో మాట్లాడుతూ తాము బిఆర్ఎస్ లోనే ఉంటామని పువ్వాడ అజయ్ కుమార్ తోనే ఉంటామని స్పష్టం చేశారు. నీరజ మాట్లాడుతూ కేసీఆర్ కేటీఆర్ ఆశీస్సులతో పువ్వాడ అజయ్ కుమార్ సహకారంతో తాను మేయర్ పదవిని చేపట్టానని తనకు ఇంతకంటే గౌరవం ఇంకేం కావాలని ప్రశ్నించారు. కాంగ్రెస్లో ఉన్న తాము ఒకసారి తుమ్మల నాగేశ్వరరావు విఆర్ఓస్లకు ఆహ్వానిస్తే వచ్చామని ఇప్పుడు ఆయనకు సీటు లభించనందున ఆయన తిరిగి కాంగ్రెస్ లోకి వెళ్లారని కానీ తాము ఒకసారి పార్టీ మారమని మళ్లీ మళ్లీ పార్టీలు మారాల్సిన అవసరం తమకు లేదని ఆమె స్పష్టం చేశారు. ఆదివారం ఖమ్మం లో జరిగే సీఎం సభకు నగర ప్రజలు పెద్ద ఎత్తున తరలి వస్తారని పువ్వాడ అజయ్ కుమార్ గెలుపును ఎవరు ఆపలేరని ఆమె పేర్కొన్నారు.

About the author

Icon News

Leave a Comment