గులాబీ బాస్ కెసిఆర్ ప్రసంగాల స్టైలే వేరు… ఆయన చెప్పే ప్రతి మాట పండితుల నుంచి పామరుల వరకు అందరికీ అర్థమైతది… బుధవారం ఆయన ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కల్లూరు ఇల్లందు సభల్లో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు…
ఆయన ప్రసంగాలు రెండు చోట్ల వ్యంగ్యాస్త్రాలు చలోక్తులతో సాగాయి…

కల్లూరు సభలో మాట్లాడుతూ జబ్బులు తరుచుకునేటోడు… బొమ్మ గడియారాలు ఇచ్చేటోడి తోటి ఏమీ కాదు… కొన్ని డబ్బులు జేబులోకి వచ్చేసరికి అహంకారం మదం వచ్చింది… హరి చావు నోట్లో తలపెట్టి తెలంగాణ తెచ్చినోడిని నేనే ఆ మాటలు అనట్లేదు… ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి ఒక్క బి ఆర్ ఎస్ ఎమ్మెల్యేని అసెంబ్లీ గేటు తాకనివ్వనంటాడు ఒకాయన… అసెంబ్లీకి ఎవరు పంపాలే ప్రజలు పంపుతారా ఈయన పంపుతారా.. గిట్ల డబ్బు మతంతో మాట్లాడే వాళ్ళని ఓడించండి… కొంతమంది మాయగాళ్లు ఊళ్ళ మీద పడ్డారు..
వాళ్ల మాయ మాటలు నమ్మి మోసపోకండి… అంటూ స్థానిక విపక్ష నాయకులపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఉద్దేశించి కెసిఆర్ గత నెల 27న పాలేరులో జరిగిన సభలో కూడా ఇటువంటి వ్యాఖ్యలు చేశారు. బుధవారం కల్లూరు సభలో కూడా అవే వ్యాఖ్యలు చేశారు. అయితే ఆయన ఈసారి వ్యంగ్యంగా విసిరిన చలోక్తులు జనం ఆసక్తిగా విన్నారు. సండ్ర వెంకట వీరయ్య సీనియర్ శాసనసభ్యుడు అని ఆయన ముఖ్యమంత్రితో సహా ఏ మంత్రి దగ్గర అయినా తన నియోజకవర్గానికి అవసరమైన పనులన్నీ చేయించుకోగలిగిన నేర్పరి అని ఆయనకు కితాబిచ్చారు.

అందుకే ఆయనను మళ్ళీ గెలిపిస్తే సత్తుపల్లి నియోజకవర్గం అభివృద్ధిలో గురుకుల పెడుతుందని కేసీఆర్ పేర్కొన్నారు. మళ్లీ అధికారంలోకి వచ్చిన తర్వాత సత్తుపల్లి నియోజకవర్గం మొత్తం దళిత బంధు అమలు జరుగుతుందని ఆయన హామీ ఇచ్చారు. కల్లూరు సభకు హాజరైన ప్రజలను చూసి సండ్ర భారీ మెజారిటీతో గెలుస్తారని ధీమా వ్యక్తం చేశారు. సీతారామ ప్రాజెక్టు పూర్తి చేసి ఉమ్మడి జిల్లాను సస్యశ్యామలం చేస్తామని కెసిఆర్ ప్రకటించారు.

…. అభివృద్ధిలో దేశంలోనే తెలంగాణ నెంబర్ వన్..
అభివృద్ధిలో తెలంగాణ అన్ని రంగాల్లో దేశంలోనే నెంబర్ వన్ స్థానంలో నిలిచిందని కేసీఆర్ అన్నారు. పక్కనే ఆంధ్ర ప్రదేశ్ ఉందని బోర్డర్ లో ఉన్నామని అంటూ ఎక్కడ డబల్ రోడ్డు మొదలై ఎక్కడ ముగుస్తుందో అది తెలంగాణ అని, ఎక్కడ నుంచి సింగిల్ రోడ్డు మొదలవుతుందో అక్కడి నుంచి ఆంధ్రప్రదేశ్ అని కెసిఆర్ వ్యాఖ్యానించారు. దీన్ని బట్టి తెలంగాణ అభివృద్ధి ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవాలని ఆయన సూచించారు.
…. లంబాడా బిడ్డలకు పాలించే అధికారం ఇచ్చిన ఘనత విఆర్ఎస్ దే…
కెసిఆర్ ఇల్లందు సభలో మాట్లాడుతూ ఎప్పటినుంచో కలలు కన్నా లంబాడాలు తమ తండాలను గ్రామపంచాయతీలుగా చేయాలనే డిమాండ్ ను నెరవేర్చిన ఘనత కేసిఆర్ ప్రభుత్వాన్ని దేనిని ఆయన అన్నారు. తమ తండాలకు ఎన్నికైన సర్పంచులుగా లంబాడాలు తామే పరిపాలించుకునే హక్కు కల్పించామని కేసీఆర్ అన్నారు. ఇల్లందు అభ్యర్థి హరిప్రియ నాయకులు గెలిపించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఇల్లందు నియోజకవర్గంలోని పోడు భూములకు పట్టాలి ఇచ్చి వారికి రైతుబంధు సౌకర్యం.. నియోజకవర్గంలో కార్యక్రమాలు చూస్తున్న రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్రన్ సీఎం కేసీఆర్ అభినందించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే హరిప్రియ తో పాటు ఖమ్మం ఎంపీ బి ఆర్ ఎస్ పార్లమెంటరీ పార్టీ నాయకులు నామా నాగేశ్వరరావు, జిల్లా నలుమూల నుంచి వచ్చిన పలువురు ప్రజా ప్రతినిధులు నాయకులు తదితరులు పాల్గొన్నారు…

స్టెప్పులేసిన పువ్వాడ అజయ్ కుమార్ , సండ్ర వెంకట వీరయ్య…
ఇలా ఉంటే కల్లూరులో సినీ గాయని జానపద కళాకారుని మధుప్రియ బృందం ఆలపించిన గేయాలు సభికులను అలరించాయి. మధుప్రియ పాడిన పాటలకు రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ సత్తుపల్లి శాసనసభ్యులు సండ్ర వెంకట వీరయ్య స్టెప్పులేసి హాజరైన సవికులందరిని ఉత్సాహపరిచారు
