ఎవరా అభ్యర్థి ఏమిటా కథ అనుకుంటున్నారు కదూ…ఆ వివరాల్లోకి వెళదాం రండి… భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రమైన కొత్తగూడెం అసెంబ్లీ నియోజకవర్గంలో , ఇమంది ఉదయ్ కుమార్ అనే యువకుడు స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికల బరిలోకి దిగుతున్నాడు. ఆయన స్వతహాగా ఒక జర్నలిస్టు ..ఇప్పటికే ఒక స్వచ్ఛంద సేవా సంస్థ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ , ప్రజల్లో ఉంటున్నాడు.. ఆయన గొప్ప ధనవంతుడు కాదు…

ఆర్టీసీ కోచ్ బిల్డర్ కుమారుడు పుస్తకాల కోసం 20 రూపాయల కూలి పనికి వెళ్ళిన వాడు.. ప్రస్తుతం ప్లెక్సీ వేసే సంస్థకుఓ చిన్నపాటి ఓనరు … ప్రముఖ జర్నలిస్టు సంఘానికి జిల్లా నాయకుడు.. సామాజికపరంగా బీసీ వర్గానికి చెందిన సామాన్యుడు.. కానీ మదర్ తెరిసా, చిరంజీవి స్ఫూర్తితో ఓ స్వచ్ఛంద సంస్థను స్థాపించి ,తన సంపాదనలో 25% పేదల కోసం ఖర్చు చేస్తున్నాడు. ఇతరులకు సహాయపడే విషయంలో ఎప్పుడు చురుగ్గా ఉంటాడు..
.అందుకే తాను ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ ేస్తున్న క్రమంలో ప్రజల వద్దకు వెళ్లి వినూత్న పద్ధతిలో ఓట్లు అభ్యర్థిస్తున్నాడు.. ఆయన ప్రజల వద్దకు వెళ్లి ఉచిత హామీలు ఇవ్వడం లేదు.. ఓటర్లు సైతం ఆలోచనలో పడే విధంగా అతని ప్రచార శైలి ఉంటుంది… ఇప్పుడు అనేకమంది ఈ ప్రచార శైలి , ఆయన ఇచ్చే కొత్త నినాదాల పైనే చర్చించుకుంటున్నారు…
…. నేను మీకోసం జీవితాంతం సేవచేస్తాను.. మీరు నా కోసం నోటు లేకుండా ఓటు వేయగలరా.!
ఓటర్ల వద్దకు వెళ్లి ఈ విధంగా పెద్ద పార్టీలు, గొప్ప అభ్యర్థులనుకునే వారు సైతం ఇలా అడగటం ప్రస్తుత పరిస్థితుల్లో గొప్ప సాహసమే , అవుతుంది.. .ప్రధాన పార్టీల నేతలు కానీ ,అభ్యర్థులు కానీ ఓటుకు నోటు విషయంలో
తమ ప్రత్యర్థి పార్టీ డబ్బు సంచులతో వస్తున్నారని నోట్లు కుమ్మరించి ఓట్లు కొంటారని పరస్పరం ఆరోపణలు చేసుకుంటారు… అంతే తప్ప తమను గెలిపిస్తే సేవ చేసేందుకు సిద్ధమని మీరు నోటు తీసుకోకుండా ఓటు వేయటానికి ఓటర్లుగా మీరు సిద్ధమా అని అడిగే ప్రయత్నం చేయరు .ఇప్పటివరకు చేయలేదు..

కానీ ఉదయ్ కుమార్ మాత్రం తను నిజాయితీగా ప్రజలు కోరుకునే మార్పు కోసం పోరాటం చేస్తానని ప్రకటిస్తూనే, దానికి అనుగుణంగా మారడానికి మీరు సిద్ధంగా ఉన్నారా… అంటూ ఓటర్లను ప్రశ్నిస్తున్నాడు.ఎన్నికల్లో గెలుపు ఓటములు తర్వాత సంగతి.
స్వతంత్ర అభ్యర్థికి ఎన్నికల మేనిఫెస్టో ఉండదు..కానీ, ఇతని ప్రచార శైలి , ఇతను ఓటర్లకు సంధించే ప్రశ్నలు, చూసిన వారికి ఓటర్లలో మార్పేదో తెచ్చే, బలమైన ఎజెండా తోనే, ప్రచారంలోకి దిగాడని భావిస్తున్నారు…
ఎన్నికల బరిలో దిగి, ప్రజలు సామాన్యుడికి ఓటు వేస్తారా ,లేదా , వేస్తే, ఎంత శాతం వరకు వేస్తారు.. అనేది తెలుసుకోవాలని ,ఎన్నికలు అత్యంత ఖరీదైన రోజుల్లో సామాన్యుడి వైపు ఎంతమంది ఉన్నారు.. తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నట్లు కొందరు విశ్లేషించుకుంటున్నారు.మరికొందరేమో ఉదయ్ కుమార్ అదృష్టం బాగుంటే ఎమ్మెల్యే కూడా కావచ్చేమో .. అంటున్నారు..
