ఒక దృశ్యాన్ని చూడగానే హృదయాలు పులకించి పోతాయి… మరో దృశ్యం చూసినప్పుడు హృదయాలు బరువెక్కుతాయి.. అలా చూడగానే అందులోని విషయాన్ని తెలిసేలా ఫోటో తీయడం అనేది గొప్ప సృజనాత్మకమైన కళ.. ది హిందూ పత్రిక ఫోటోగ్రాఫర్ గా ఇప్పటికే అనేక అవార్డులను సొంతం చేసుకున్న జి ఎన్ రావు ఇప్పుడు తాజాగా భారత్ ప్రెస్ ఫోటో అవార్డు గెలుచుకోవడం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు..

..అవార్డు తెచ్చిపెట్టిన దాండియా ఫోటో ఇదే..
వరల్డ్ ఫోటో జర్నలిజం డే సందర్భముగా ఇండియా ఇంటర్నేషనల్ ఫోటోగ్రాఫిక్ కౌన్సిల్ మరియు ఫోటోగ్రఫీ అకాడమీ అఫ్ ఇండియా నిర్వహించిన ఫోటోగ్రఫీ కాంపిటేషన్ లో ది హిందూ ఫోటోజర్నలిస్టు జి యన్ రావుకు భారత్ ప్రెస్ ఫోటో అవార్డు లభించింది. అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన పోటీలకుగాను ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల్లో వివిధ పత్రికల్లో పనిచేస్తున్న అనేకమంది ఫోటో జర్నలిస్లు వారు తీసిన అద్భుతమైన ఫోటోలను పంపించారు. ఇందులో భాగముగా జి యన్ రావుకు దసరా సందర్భముగా మార్వాడి మహిళలు దాండియా ఆడుతున్న నృత్యానికి గాను ఈ అవార్డు వచ్చింది. ఆర్ ఆర్ కె మెమోరియల్ ద్వార ఈ అవార్డు ను ప్రపంచ ఫోటో జర్నలిజం డే సెలెబ్రేషన్స్ లో భాగముగా నవంబర్ 1 న అందుకోనున్నారు.
