ఆంధ్రప్రదేశ్ క్రైమ్ వార్తలు జాతీయం తెలంగాణ రాజకీయం

సిపిఎం కాంగ్రెస్ వర్గాల మధ్య ఘర్షణ…సిపిఎం కార్యకర్త నాగేశ్వరరావు మృతి..గోవిందాపురం గ్రామంలో తీవ్ర ఉద్రిక్తత…నాగేశ్వరరావుకు ఘనంగా నివాళులర్పించిన సిపిఎం రాష్ట్ర, జిల్లా నాయకులు

Written by Mohiddin Shaik

ఒక పక్క సీపీఎం కాంగ్రెస్ మధ్య ఎన్నికల పొత్తు పై చర్చలు జరుగుతున్న సందర్భంలో మధిర నియోజకవర్గ పరిధిలోని గోవిందాపురం ఎల్ గ్రామంలో ఒక స్థానిక సమస్యతో మొదలైన సిపిఎం కాంగ్రెస్ వర్గాల మధ్య మనస్పర్ధలు చివరకు భారీ ఘర్షణకు దారి తీసాయి. కాంగ్రెస్ వర్గీయులు ఇతర గ్రామాల నుంచి కూడా కొందరిని పథకం ప్రకారం పిలిపించుకొని సిపిఎం నాయకుల ఎండ్లపై రాళ్లతో దాడి చేశారని సిపిఎం వర్గీయులు ఆరోపిస్తున్నారు. అటు సిపిఎం ఇటు కాంగ్రెస్ వర్గీయుల మధ్య రాళ్లు, కర్రలతో జరిగిన కొట్లాటలో సిపిఎం పార్టీకి చెందిన ఎర్రబోయిన నాగేశ్వరరావు అనే కార్యకర్త తలకు తీవ్ర గాయం అయింది ఆయనకు మెదడులో రక్తం గడ్డకట్టుకుపోవడంతో ఆస్పత్రులు చేర్పించినప్పటికీ చికిత్స పొందుతూ శనివారం ఉదయం మృతి చెందారు. అది గ్రామానికి సంబంధించి స్థానిక సమస్య అయినప్పటికీ చాలా కాలం తర్వాత రాజకీయ సంఘర్షణ దాడులు ప్రతి దాడులు బోనకల్లు మండలంలో చోటుచేసుకున్నాయని చెప్పవచ్చు

సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ప్రాతినిధ్యం వహిస్తున్న మధుర నియోజకవర్గంలో ఉన్న గోవిందాపురం గ్రామంలో ఇటు సిపిఎం పార్టీకి అటు కాంగ్రెస్ కి కూడా మంచి పట్టు ఉన్నదని కాంగ్రెస్ కంటే కూడా సిపిఎం క్యాడరే కొంత అధికంగా ఉన్నదని తెలుస్తోంది.. అయినప్పటికీ కాంగ్రెస్ స్థానిక నాయకులు చింతకాని మండలం నుంచి ఇతర గ్రామాల నుంచి కూడా కొందరిని అక్కడికి పిలిపించుకొని పథకం ప్రకారం సిపిఎం కార్యకర్తలపై దాడి చేశారని ఆ పార్టీ నాయకులు ఆరోపిస్తున్నారు.

…అమ్మవారి ఊరేగింపు సందర్భంగా ఘర్షణ…

గొడవకు సంబంధించి వివరాలు ఈ విధంగా ఉన్నాయి గత మూడు రోజుల క్రితం దసరా ఉత్సవాల ముగింపు సందర్భంగా అమ్మవారి విగ్రహాన్ని ఊరేగింపుగా నిమజ్జనానికి తీసుకెళుతున్న సందర్భంలో కాంగ్రెస్ కార్యకర్తలు ఒక్కసారిగా సిపిఎం నాయకుల పై రాళ్లతో దాడికి దిగారని చెబుతున్నారు. అది సందర్భంలో సిపిఎం కు చెందిన కార్యకర్తలు కూడా రాళ్లతోటి కర్రలతోటి ఎదురుదాడికి దిగారని పరస్పరం దాడులు జరిగాయని ఆ సందర్భంలో నాగేశ్వరరావు అని సిపిఎం కార్యకర్త బజారు నుండి సరుకులు తీసుకుని ఇంటికి వస్తుండగా కాంగ్రెస్ కార్యకర్తలు దాడి చేశారని తలకు తీవ్రమైన గాయం అయిందని సిపిఎం నాయకులు తెలిపారు. దాంతో ఆయనను ఆసుపత్రికి చేర్చగా మెదడులో రక్తం గడ్డ కట్టిందని చికిత్స అందించినప్పటికీ ఫలితం ఉండకపోవచ్చని డాక్టర్లు ముందే తెలిపినట్లు వారు పేర్కొన్నారు అయినప్పటికీ చికిత్స అందిస్తుండగానే శనివారం ఉదయం నాగేశ్వరరావు తిదిశాస విడిచారు. నాగేశ్వరరావు మృతి చెందినట్లు తెలియగానే గ్రామంలోని కాంగ్రెస్ కార్యకర్తలు అంతా గ్రామం విడిచి వెళ్లిపోయినట్లు తెలుస్తోంది.

…నివాళులర్పించిన తమ్మినేని వీరభద్రం, ఇతర నాయకులు…

నాగేశ్వరరావు మృతదేహానికి సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఘనంగా నివాళులు అర్పించారు. ఆ గ్రామంలో చోటు చేసుకున్న ఘర్షణ వాతావరణం అందుకు కారణాలను తెలుసుకున్న ఆయన , ఎర్రజెండాలను దాడులతో అణచివేయటం ఎవరికి సాధ్యం కాదని అన్నారు.

నాగేశ్వరావు మృతదేహాన్ని శనివారం సాయంత్రం గోవిందపురం గ్రామానికి తీసుకురాగానే సిపిఎం రాష్ట్ర నాయకులు పోతినేని సుదర్శన్ రావు , జిల్లా కార్యదర్శి నున్న నాగేశ్వరరావు, జిల్లా నాయకులు పొన్నం వెంకటేశ్వరరావు తదితర నాయకులంతా గోవిందపురం చేరుకొని నాగేశ్వరరావు కు ఘనంగా నివాళులర్పించారు. గ్రామంలో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితి నెలకొని ఉండడంతో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు గ్రామంలో పోలీస్ టికెట్ ఏర్పాటు చేసి స్పెషల్ పార్టీ బలగాలను దించారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా వైరా డి.ఎస్.పి రెహమాన్ ఆధ్వర్యంలో పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నారు..

About the author

Mohiddin Shaik

Leave a Comment