సీఎం కేసీఆర్ ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గంలో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభకు వస్తు ట్రాక్టర్ ప్రమాదంలో ఒక మహిళ మృతి చెందగా, మరో ఇద్దరు పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. వివరాలు ఇలా ఉన్నాయి కూసుమంచి మండల పరిధిలోని గైగొల్లపల్లి గ్రామానికి చెందిన 26 మంది బిఆర్ఎస్ కార్యకర్తలు ముఖ్యమంత్రి సభకు ట్రాక్టర్లు బయలుదేరారు . నాను తండా సమీపంలోకి రాగానే ట్రాక్టర్ ప్రమాదవశాత్తు ట్రక్కు పడిపోయింది. దాంతో అందులో ఉన్న కార్యకర్తలు అంతా కింద పడిపోయారు.

కాగా వారిలో అల్లి సూర్యమ్మ అనే మహిళ అక్కడికక్కడే మృతి చెందింది. కాగా మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. వారితోపాటు ట్రాక్టర్ డ్రైవర్ మల్సూరు కూడా తీవ్ర గాయాల పాలయ్యారు . తీవ్రంగా గాయపడిన వారిలో తేలు సావిత్రమ్మ, నరసింహ చారి , కోట వేలాద్రి , ఉన్నారు. మరి కొంతమంది తురక విష్ణు , యమునా , సంగాబత్తుల మధుసూదనాచారి తో పాటు మరో ఇద్దరు స్వల్పంగా గాయపడ్డారు. వారిని ఆసుపత్రికి తరలించి వైద్య సేవలు అందిస్తున్నారు….
….. మృతురాలి కుటుంబానికి రూ.10 లక్షలు అందించిన ఎమ్మెల్యే కందాల…
ప్రమాద వార్త తెలియగానే ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి మృతురాలి భౌతికకాయాన్ని సందర్శించి ఆమె కుటుంబ సభ్యులకు, తక్షణమే ఆసుపత్రి వద్ద పది లక్షల రూపాయలు అందజేసి తన ప్రగాఢ సంతాపాన్ని సానుభూతిని తెలియజేశారు. తన గెలుపు కోసం జరిగే సభకు వస్తున్న కార్యకర్తలు ప్రమాదానికి గురి కావడం తనకు ఎంతో బాధ కలిగించిందని ఉపేందర్ రెడ్డి పేర్కొన్నారు .మృతురాలి కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటామని ఆయన ప్రకటించారు. కూసుమంచి ఎస్ఐ రమేష్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
