తెలంగాణలో ఎవరి చేరిక ద్వారా కమల వికాసం జరుగుతుందని భావించారో… , డబుల్ ఇంజన్ సర్కార్ ఎవరి ద్వారా వస్తుందని బిజెపి భావించిందో… , ఆ బలమైన నాయకుడు ఇప్పుడు కమలం పార్టీని వీడి, కాంగ్రెస్ గూటికి చేరుతున్నారు… కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి శుక్రవారం ఢిల్లీలో రాహుల్ గాంధీ చేతులు మీదుగా కాంగ్రెస్ కండువా కప్పుకొనున్నారు. ఆయన బుధవారం బిజెపి కి రాజీనామా సమర్పించారు. రాజీనామాకు కారణాలు చెబుతూ, తెలంగాణలో ప్రజలు కాంగ్రెస్ వైపు వెళ్లారు.. అందుకే తాను కూడా కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు ప్రకటించారు.. బి ఆర్ ఎస్ ను ఓడించాలని ఏకైక లక్ష్యంతో తాను బిజెపిలో చేరానని, కానీ బి ఆర్ ఎస్ ను ఓడించే శక్తి కాంగ్రెస్కు మాత్రమే ఉందని రాజగోపాల్ ప్రకటించారు.. అంటే పరోక్షంగా తెలంగాణలో బిజెపికి బీఆర్ఎస్ ను ఓడించడం అసాధ్యమని ఆయన తన అభిప్రాయాన్ని కుండబద్దలు కొట్టారు.. అంతటితో ఆగకుండా ప్రజలంతా కాంగ్రెస్ను కోరుకున్నప్పుడు తాను కూడా ప్రజల మాటే వినాల్సి ఉంటుందన్నారు. ఆయన తో పాటు వివేక్ వెంకటస్వామి కూడా కాంగ్రెస్లో చేరతారని ప్రచారం జరుగుతోంది. అదేవిధంగా ఒక మాజీ ఎంపీ కూడా కాంగ్రెస్లో చేరేందుకు ముహూర్తం ఖరారు చేసుకున్నట్లు ప్రచారంలో ఉంది..
….. కాషాయ శిబిరంలో కంగారు…

కోమటిరెడ్డి రాజగోపాల్ తో సహా కొందరు బిజెపిలో చేరితే తెలంగాణలో డబుల్ ఇంజన్ సర్కారు తెస్తామని గతంలో బిజెపి నేతలు గంటాపదంగా చెప్పారు. ఇప్పుడు ఎవరి ద్వారా డబుల్ ఇంజన్ సర్కారు తీసుకు రాగలుగుతామని బిజెపి నేతలు భావించా ఆ నాయకుడితో పాటు మరికొందరు కీలకమైన నాయకులు కాంగ్రెస్లో చేరతారని ప్రచారం ఊపందుకుంది . దీంతో కాషాయ పార్టీ శిబిరంలో కంగారు మొదలైంది. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బిజెపికి రాజీనామా చేశారు .తాను కాంగ్రెస్లో చేరుతున్నట్లు కూడా ప్రకటించారు. రాష్ట్రంలో బిజెపిని అధికారంలోకి తెచ్చేందుకు ఆ పార్టీ పెద్దలు రాజగోపాల్ తో పాటు అనేకమంది కీలక నేతలను చేర్చుకునేందుకు ప్రత్యేకంగా చేరికల కమిటీని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఆ కమిటీకి మాజీ మంత్రి ఈటల రాజేందర్ ను అధ్యక్షుడిగా కూడా నియమించారు. చేరికల కమిటీ ఆధ్వర్యంలో అనేక మందిని చేర్చుకునేందుకు బిజెపి ముమ్మర ప్రయత్నాలు చేసినప్పటికీ, కొత్తగా పెద్ద నేతలు ఎవరు చేరకపోగా ఆ పార్టీలో ముఖ్యులు అనుకున్న నేతలు కొందరు కమలాన్ని వీడి హస్తం గూటికి చేరుతుండడం బిజెపికి జీర్ణించుకోలేని అంశంగా మారిందని చెప్పవచ్చు. రెండు మూడు రోజుల్లోనే వివేక్ వెంకటస్వామి తో పాటు మరికొందరు హస్తం గూటికి చేరతారనే ప్రచారం జరుగుతుంది.
మొత్తం మీద రాష్ట్రంలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ సమీకరణలు వేగంగా మారిపోతున్నాయి. మారుతున్న సమీకరణల ప్రకారం గతం కంటే కాంగ్రెస్ బాగా బలం పుంజుకుంటుందని అధికారం వైపు అడుగులు వేసిన ఆశ్చర్యం లేదని అభిప్రాయాలు పరిశీలకులు కొందరు వ్యక్తం చేస్తుండగా , వీఆర్ఎస్ మళ్లీ తిరిగి మూడవసారి అధికారంలోకి వస్తుందని కొందరు విశ్లేషిస్తున్నారు. మొత్తం మీద కోమటిరెడ్డి బిజెపికి రాజీనామా చేసి కాంగ్రెస్ లో చేరడంతో ఉమ్మడి ఖమ్మం జిల్లా మాదిరిగానే , ఉమ్మడి నల్లగొండ జిల్లాలో కూడా కాంగ్రెస్కు బలం చేకూరిందని మెజారిటీ స్థానాల్లో ఆ పార్టీ విజయ అవకాశాలు ఉన్నాయని అభిప్రాయాలు రాజకీయ పరిశీలకులు వ్యక్తం చేస్తున్నారు.
