ఆంధ్రప్రదేశ్ జాతీయం తెలంగాణ రాజకీయం

కాక రేపుతున్న ఖమ్మం రాజకీయాలు…సింహ గర్జనలు… కౌంటర్ హెచ్చరికలు… రాష్ట్ర రాజకీయ వర్గాల్లో ఖమ్మం పై ఆసక్తికర చర్చ..

Written by Mohiddin Shaik

ఖమ్మం ఖిల్లా ను సుదీర్ఘకాలం కమ్యూనిస్టులు, ఆ తరువాత కొంతకాలం టిడిపి ,కాంగ్రెస్ పార్టీ వారు, ఏలేరు… సొంత రాష్ట్రం ఏర్పడ్డాక ఖమ్మం మున్సిపాలిటీ కార్పొరేషన్ గా అవతరించింది… ఆ కార్పొరేషన్ తొలి ఎన్నికల్లో టిఆర్ఎస్ అనూహ్యంగా చారిత్రిక విజయం సొంతం చేసుకుంది.. ఖమ్మం మెడలో గులాబీ కండువాను అలంకరించి కొత్త చరిత్రను సృష్టించిన ఆనాటి తొలి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు… ఆ తరువాత గులాబీ పార్టీని ఖమ్మంలో చెక్కు చెదరకుండా రింత బలంగా తయారు చేసిన రెండవ నాయకుడు , ఈనాటి మంత్రి పువ్వాడ అజయ్ కుమార్…
ఆ ఇద్దరూ నాయకులు ఈ ఎన్నికల యుద్ధంలో ఖమ్మం నుంచి తలపడబోతున్నారు.. ..

రాష్ట్రంలో జరుగుతున్న ఎన్నికలు ఒక ఎత్తు అయితే, ఖమ్మంలో జరగబోయే ఎన్నిక ఒక ఎత్తుగా కొందరు పరిశీలకులు భావిస్తున్నారు.. తుమ్మల నాగేశ్వరరావు సుదీర్ఘ రాజకీయ అనుభవంతో పాటు , ఆయన రాజకీయ జీవితంలో అత్యధిక కాలం వివిధ శాఖలకు మంత్రిగా పనిచేశారు… ఇక పువ్వాడ అజయ్ కుమార్ కార్మిక , కర్షక పీడిత జన హృదయాల్లో మంచి స్థానం పొందిన కమ్యూనిస్టు నాయకుని కుటుంబం నుంచి వచ్చారు… రాజకీయంగా తుమ్మలతో పోల్చితే తక్కువ అనుభవమే ఉన్నప్పటికీ , జనంలోనే గాక ముఖ్యమంత్రి మనసును కూడా గెలుచుకొని మంత్రి పదవి చేపట్టి, ఖమ్మం నియోజకవర్గం లో తనకంటూ ఒక పట్టును సాధించిన వ్యక్తిగా అజయ్ కుమార్ పేరు తెచ్చుకున్నారు..
ఇటువంటి ఇద్దరు ఉద్దండులైన అభ్యర్థుల మధ్య పోటీ అంటే సహజంగానే రాజకీయ పండితుల నుంచి సామాన్యుల వరకు ఆసక్తిగా చూస్తారు…
అందుకే ఖమ్మం రాజకీయాలు రాష్ట్రస్థాయి రాజకీయ వర్గాల దృష్టిని ఆకర్షిస్తున్నాయి…

…. ఓట్ల చీలికపై దృష్టి పెట్టిన తుమ్మల….

ఖమ్మం నియోజకవర్గం లో వివిధ రూపాల్లో అభివృద్ధి చేసి న మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ నియోజకవర్గం పై పట్టు బిగించారనే అభిప్రాయాలు పరిశీలకుల్లో వ్యక్తం అవుతున్నాయి. అందుకే హస్తం గుర్తుపై పోటీ చేయబోతున్న మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వి ఆర్ ఎస్ ఓట్లను చీల్చడంపై ప్రధానంగా దృష్టి సారించారు. ఒక విధంగా చెప్పాలంటే టిఆర్ఎస్ ఓట్లను భారీగా చీల్చగలిగితే తప్ప అజయ్ కుమార్ ను ఢీకొట్టడం సాధ్యపడదని కాంగ్రెస్ భావిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. కాంగ్రెస్ ప్రవేశపెట్టిన 6 గ్యారంటీలతోపాటు తుమ్మల నాగేశ్వరరావు కు ఖమ్మం నియోజకవర్గంలో గల పరిచయాలు ఆ పార్టీకి కలిసి వస్తాయని కాంగ్రెస్ అంచనా వేసింది. టిఆర్ఎస్ ఓట్లను చీల్చే ప్రయత్నాలు ఒకపక్క ముమ్మరంగా జరుగుతుండగా , మరోపక్క మంత్రి అజయ్ కుమార్ అప్రమత్తమై చీలికలను శక్తి మేరకు అడ్డుకునే ప్రయత్నాలు చేస్తున్నారు..

.. సింహ గర్జనలు… కౌంటర్ హెచ్చరికలు…

వలసలను అడ్డుకునే ప్రయత్నంలోనే పువ్వాడ అజయ్ కుమార్ నేను లేనప్పుడు దొంగల్లాగా వచ్చి మా కార్పొరేటర్లు కొందరిని తీసుకెళ్లారు… దమ్ముంటే నేను ఉన్నప్పుడు రండి అంటూ గర్జించారు.. దానికి కౌంటర్ గా తుమ్మల వర్గం నుంచి అజయ్ కుమార్ ది బందిపోటు రాజకీయాలంటూ, దొంగ రాజకీయాలు అంటూ మీ రాజకీయాలు ఇకపై సాగ వన్టూ హెచ్చరికలు చేశారు.. పరస్పర గర్జనలు హెచ్చరికల , వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి

…. ఆచితూచి అభ్యర్థిని పెట్టిన కాంగ్రెస్….

మంత్రి అజయ్ కుమార్ ను ఢీకొని రంగంలో నిలబడాలంటే తుమ్మల అయితేనే సరిపోతారని కాంగ్రెస్ , వ్యూహ కర్తలు భావించారు. ఖమ్మం నియోజకవర్గంలో టిఆర్ఎస్ బలంగా ఉండటంతో పాటుగా అజయ్ కుమార్ ను బలమైన అభ్యర్థిగా కాంగ్రెస్ నిర్ధారించుకున్నట్లు తెలుస్తోంది. తుమ్మల అయితే చౌద రి సామాజిక వర్గ ఓట్లతో పాటు గతంలో ఆయన సహచరులుగా , అనుచరులుగా, బీఆర్ఎస్ లో పనిచేసిన కార్యకర్తలు, నాయకులు కొందరైనా కాంగ్రెస్లో చేరతారని కాంగ్రెస్ నాయకులు అంచనా వేశారు. ఆ అంచ నాకు అనుగుణంగానే, తుమ్మల తనకు ఖమ్మం సీటు కేటాయించినట్లు అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇవ్వగానే , గతంలో విఆర్ఎస్ లో తనతో కలిసి పని చేసిన అనుచరులు నాయకుల పై దృష్టి సారించారు ఇప్పటికే టిఆర్ఎస్ మాజీ నగర అధ్యక్షుడు కార్పొరేటర్ కమార్తపు మురళితో పాటు కొందరు తుమ్మల పక్కకు వచ్చారు. ఇంకా అనేకమంది వస్తారని ప్రచారం జరుగుతుంది. ప్రధానంగా కార్పొరేటర్ల పై దృష్టి పెట్టారు.

గతంలో కార్పొరేటర్లుగా అనేకమందికి తుమ్మలే టికెట్లు ఇప్పించారనే ప్రచారం ఉంది . వారు ఇప్పుడు తుమ్మల పిలుపుమేరకు కొంతమంది ఆయన వైపు వెళతారనే ప్రచారం జరుగుతోంది. దాంతోపాటు తుమ్మల నాగేశ్వరరావు ఖమ్మం నగరంలోని ప్రధాన వర్తక , వ్యాపార వర్గాల వారిని కలుసుకొని వారి మద్దతును కోరుతున్నారు. తెలుగుదేశం పార్టీకి చెందిన ఓట్లలో మెజారిటీ ఓట్లు తుమ్మలకు అనుకూలంగా వస్తాయని ప్రచారం కూడా జరుగుతుంది. ఒక ఖమ్మం నగరంలోనే రెండు లక్షలకు పైగా ఓటర్లు ఉన్నారు. ఇదిలా ఉంటే ఇక మంత్రి అజయ్ కుమార్ ఇప్పటికే ప్రచారంలో చాలా ముందున్నారు . అనేక పర్యాయాలు ఆయన నియోజకవర్గంలో పర్యటనలు , ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహించారు. నిత్యం నియోజకవర్గంలోనే ఉంటూ ప్రజలతో మమేకమై ఉండే అజయ్ కుమార్ ప్రచారంలో కూడా ప్రస్తుతానికి ముందే ఉన్నారని చెప్పవచ్చు. ఊహించని విధంగా ఖమ్మం నుంచి తుమ్మల నాగేశ్వరరావు కాంగ్రెస్ పక్షాన బరిలోకి దిగుతుండడంతో బిఆర్ఎస్ అధినాయకత్వం కూడా ఖమ్మం సీటుపై ప్రధాన దృష్టి సారించినట్లు సమాచారం. మొత్తం మీద ఒకే సామాజిక వర్గానికి చెందిన మంత్రి, మాజీ మంత్రి , ఇద్దరు ఖమ్మం బరిలో నిలవబోతుండడంతో రాజకీయ , వర్గాల్లో ఆసక్తి నెలకొంది.

About the author

Mohiddin Shaik

Leave a Comment