రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ప్రాతినిధ్యం వహిస్తున్న ఖమ్మం కోటను ఢీకొట్టేందుకు కాంగ్రెస్ ప్రయత్నాలు ప్రారంభించింది.. మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు రంగంలోకి దించి ఖమ్మం కార్పొరేషన్ లో వలసల పర్వానికి తెరలేపింది… అయితే మంత్రి అజయ్ కుమార్ అత్యంత వేగంగా స్పందించి ఆ వలసల పర్వానికి అడ్డుకట్ట వేశారు… కాంగ్రెసులోకి దూకేందుకు సై అంటున్న కొందరు కార్పొరేటర్లతో పువ్వాడ అజయ్ కు జై అని అనిపించారు… మాజీ ఎమ్మెల్సీ బీఆర్ఎస్ నేత బాలసాని లక్ష్మీనారాయణ హస్తం పార్టీలో చేరుతున్నట్లు ప్రకటించారు.

ఖమ్మం, పాలేరు నియోజకవర్గాల నుంచి తమ బెర్తులు ఖరారు చేసుకున్న మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆదివారం ఢిల్లీ నుంచి ఖమ్మం వచ్చి నేరుగా బాలసాని లక్ష్మీనారాయణ ఇంటికి వెళ్లి ఆయనను కాంగ్రెస్లోకి ఆహ్వానించారు. తుమ్మల నాగేశ్వరరావుకు అనుచరుడిగా , సహచరుడిగా కొన్ని దశాబ్దాల పాటు పనిచేసిన బాలసాని లక్ష్మీనారాయణ బి ఆర్ ఎస్ నుంచి తిరిగి కాంగ్రెస్లోకి చేరడంతో తుమ్మల నాగేశ్వరరావు తన ఆనందాన్ని వ్యక్తం చేశారు.. అదే విధంగా ఖమ్మం కార్పొరేషన్ లో గతంలో తుమ్మల నాగేశ్వరరావు విఆర్ఎస్ మంత్రిగా ఉండగా ఆయన ఆశీస్సులతో అనేకమంది కార్పొరేటర్లుగా పోటీ చేసి గెలిచారు. వారిలో కొంతమంది, కాంగ్రెస్లో చేరేందుకు సిద్ధమయ్యారు. మాజీ నగర టిఆర్ఎస్ అధ్యక్షుడు కార్పొరేటర్ కామర్తపు మురళి, తన డివిజన్లో ఉన్న విఆర్ఎస్ కమిటీలోని మెజారిటీ నాయకులను తీసుకొని కాంగ్రెస్లో చేరేందుకు ఆదివారం హైదరాబాద్ వెళ్లారు.
…. వేగంగా నష్ట నివారణ చేపట్టిన మంత్రి అజయ్ కుమార్…

తుమ్మల నాగేశ్వరరావు పిలుపు మేరకు ఖమ్మం కార్పొరేషన్ కార్పొరేటర్లు కొందరు కాంగ్రెస్లో చేరతారని సమాచారంతో మంత్రి అజయ్ కుమార్ వారందరినీ సమావేశపరిచి వారితో చర్చించి టిఆర్ఎస్ కు జై కొట్టించారు. వలసలు బిఆర్ ఎస్ నుంచి కొంతమంది వలస వెళ్తారనే ప్రచారంతో ఆయన అప్రమత్తమయ్యారు. బి ఫారం తీసుకునేందుకు హైదరాబాదు వెళ్లిన అజయ్ కుమార్ హుటాహుటిన ఖమ్మం చేరుకొని ప్రత్యర్ధుల ఎత్తుగడలను తిప్పికొట్టే ప్రయత్నం చేశారు.. ఆయా కార్పొరేటర్లు అంతా పువ్వాడకు జై అంటూ పువ్వాడతోనే ఉంటామంటూ నినాదాలు చేశారు.
…. కాంగ్రెస్లో భంగపడిన నాయకుల సమాలోచనలు…

ఖమ్మం, కొత్తగూడెం, పాలేరు నియోజకవర్గాల నుంచి కాంగ్రెస్ పక్షాన తమకు టిక్కెట్ లభిస్తుందని ఆశించిన మహమ్మద్ జావేద్, రాయల నాగేశ్వరరావు , పోట్ల నాగేశ్వరరావు, ఒక చోట చేరి సమాలోచనలు జరిపారు కాంగ్రెస్లో అసంతృప్తితో ఉన్న నాయకులను గుర్తించి విఆర్ఎస్ లోకి లాగేందుకు ఆ పార్టీ ప్రయత్నాలు ప్రారంభించింది. పాలేరు నియోజకవర్గ టికెట్ ఆశించి అధికారం లేకపోయినా కాంగ్రెస్ పార్టీని అంటిపెట్టుకొని ఉండి పనిచేసిన రాయల నాగేశ్వరరావు ను విఆర్ఎస్ లోకి రావలసిందిగా ఆ పార్టీ కోరినట్లు చర్చ జరుగుతోంది అదేవిధంగా మొహమ్మద్ జావేద్ తో సహా కోట్ల నాగేశ్వరరావును కూడా విఆర్ఎస్ లోకి లాగేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు చర్చ జరుగుతుంది ఈ నేపథ్యంలో ఆ ముగ్గురు నాయకులు పోట్ల నాగేశ్వరరావు ఇంట్లో సమావేశమై ఏమి చేయాలనే అంశంపై చర్చించుకున్నట్లు సమాచారం. ..
మొత్తం మీద ఖమ్మం రాజకీయాలు రాష్ట్ర దృష్టి ఆకర్షిస్తున్నాయి.
