ఆంధ్రప్రదేశ్ క్రైమ్ వార్తలు జాతీయం

ప్రేమ, పెళ్లి , చావు… 22 ఏళ్లకే ఇవన్నీ పూర్తి చేశారు… అశ్వరావుపేట జంట ఆత్మహత్య సంచలనం రేపింది.. జీవితం గోరంత ….ఆవేశం కొండంత…

Written by Mohiddin Shaik

కులం వేరు అయినా ప్రేమించుకున్నారు… తల్లి తండ్రి వ్యతిరేకించిన పెళ్లి చేసుకున్నారు.. సొంత గ్రామంలోనే వేరు కాపురం పెట్టారు… కొంతకాలం ప్రాణానికి ప్రాణంగా బతికారు… ఎందుకో తెలియదు గాని వారి మధ్య గొడవలు తలెత్తాయి… తాము ఉంటున్న గదిలోనే ఇద్దరు బలవంతంగా ప్రాణాలు తీసుకున్నారు…
ప్రేమ వారిది… పెళ్లి నిర్ణయం వారిది… జీవితం వారిది… బలవంతంగా ప్రాణాలు తీసుకునే నిర్ణయం వారిదే…! కానీ తమ శేష జీవితమంతా కుమిలిపోయే భయంకరమైన శిక్షను అనుభవించే దురదృష్టం తల్లిదండ్రులది…ఎన్నో ఆశలతో 20 ఏళ్ల పాటు పెంచిన తల్లిదండ్రులు, తమ బిడ్డలు తమ నిర్ణయాలకు వ్యతిరేకంగా వేరుగా జీవించినా సంతోషపడతారు… కానీ అల్లారు ముద్దుగా పెరిగిన ఆ బిడ్డలు తమ కళ్ళముందే ఆత్మహత్య చేసుకుంటే ఆ తల్లిదండ్రుల గుండెలు తట్టుకోగలవా…! తమ బిడ్డల మరణాలను గుర్తు చేసుకుంటూ జీవచ్ఛవాలుగా మిగిలిపోక ఏం చేస్తారు… ప్రేమికులు , ప్రేమ వల్ల మరణించాలని నిర్ణయం తీసుకునేవారు, తల్లి దండ్రుల సోకాన్ని కూడా గమనంలోకి తీసుకోవాలి….

…….వివరాలు ఇలా ఉన్నాయి…..

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట గ్రామంలో పెళ్ళైన ప్రేమ జంట ఆత్మహత్య చేసుకున్నారు .ఈ సంఘటన గురువారం ఉమ్మడి ఖమ్మం జిల్లాతో పాటు రాష్ట్రంలోనే సంచలనం రేపింది. ఆత్మహత్య చేసుకున్న యువతి రమ్య (20)ది దమ్మపేట మండలం నెమలి పేట గ్రామం . ఆమె తండ్రి ఇదివరకే మృతిచెందగా, తల్లి ఆమెను తన నాయనమ్మ కుడివి ముత్తమ్మ వద్ద విడిచిపెట్టి వెళ్లిపోయింది. ఆమెకు ఒక చెల్లెలు కూడా ఉంది. రమ్య తన నాయనమ్మ వద్దే పెరిగింది . అశ్వరావుపేటలో ఒక దుకాణంలో ఆమె పని చేస్తున్న సందర్భంలో ఆ గ్రామానికి చెందిన ఎర్రం కృష్ణ (22) అనే యువకుడితో పరిచయమై ప్రేమగా మారింది. కృష్ణ తల్లిదండ్రులు వారి ప్రేమను వ్యతిరేకించినప్పటికీ తాను ఆ యువతిని పెళ్లి చేసుకుని అదే గ్రామంలో వేరు కాపురం పెట్టాడు.

కొంతకాలం వారి కాపురం సంతోషంగానే సాగింది .వారి మధ్య ఇటీవల మనస్పర్ధలు వచ్చాయి. గొడవలు పడ్డారు. ఏమైందో గురువారం ఆసుపత్రికి వెళ్లి వచ్చి ఇంట్లోకి వెళ్లిన వారు ఎంతసేపటికి బయటికి రాకపోవడంతో , కాలనీవాసులు వారి తలుపు తట్టి చూడగా, రమ్య మిగతాజీవిగా ఆ గదిలో బల్లపై పడి ఉండగా, ఆ పక్కనే చీరతో ఉరి వేసుకుని కృష్ణ విగత జీవిగా కనిపించాడు. అక్కడి పరిస్థితిని బట్టి రమ్య ఏదైనా విషం తీసుకుని ఆత్మహత్య చేసుకుందా, లేక కృష్ణ ఆమెను ఏదైనా చేసి, తాను కూడా ఆత్మహత్య చేసుకున్నాడా, అనేది తెలియాల్సి ఉంది. స్థానికులు ఇచ్చిన సమాచారంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

… .. నిర్ణయాలు ప్రేమికులవి, శిక్షలు తల్లిదండ్రు లకు….

ప్రేమికులు తమ ప్రేమను గెలిపించుకోవడం, పెళ్లి చేసుకోవడం ఆ తరువాత మనస్పర్ధలు వస్తే ఆత్మహత్యలు చేసుకోవడం ఇలా చేస్తున్న వారి సంఖ్య ఇటీవల పెరిగింది. రమ్య , కృష్ణ వీరి వివాహం నాలుగేళ్ల క్రితం జరిగింది . వీరిది కులాంతర ప్రేమ వివాహం. సినిమాల్లో ప్రేమికుల కు అయితే ఇలా చేస్తే ఇబ్బంది లేదు. ఎందుకంటే వారికి బాధ్యతలు ఉండవు . కానీ నిజ జీవితంలో వారికి తల్లితండ్రులు , అక్కచెల్లెళ్ళు ఉంటారు. సదరు ప్రేమికుల నిర్ణయాలు ఆయా కుటుంబాలను ప్రభావితం చేస్తాయి. అలాంటి భయంకరమైన నిర్ణయాలు తీసుకునే ప్రేమికులు ఈ విషయాలను దృష్టిలో ఉంచుకొని ఆత్మహత్య చేసుకోవడం కాకుండా అవసరమైతే విడిపోయి బతికేందుకు నిర్ణయాలు తీసుకోవాలని సామాజికవేత్తలు కోరుకుంటున్నారు.

About the author

Mohiddin Shaik

Leave a Comment