ఖమ్మం జిల్లా పరిషత్తు చైర్మన్ మధిర నియోజకవర్గం బి.ఆర్.ఎస్ అభ్యర్థి లింగాల కమల్ రాజ్ మాతృమూర్తి కరుణమ్మ ఆదివారం అనారోగ్యంతో తుది శ్వాస విడిచారు. ఆమె భౌతిక కాయాన్ని వైరా మండలం కొష్టాల గ్రామంలోని తమ స్వగృహంలో బంధువులు ,ఆప్తుల సందర్శనార్థం ఉంచినారు. విషయం తెలుసుకున్న రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తో పాటు పలువురు నాయకులు కొష్టాల గ్రామానికి వెళ్లి ఆమె పార్దివ దేహానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా మంత్రి అజయ్ కుమార్ కమల్ రాజు కుటుంబానికి ధైర్యం చెబుతూ తన సంతాపాన్ని ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

కమల్ రాజు మాతృమూర్తి మరణం పట్ల రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్, కేటీఆర్ తో పాటు ఖమ్మం ఎంపీ నామ నాగేశ్వరరావు, రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర , పలువురు మంత్రులు , ఎమ్మెల్సీ జిల్లా బి.ఆర్.ఎస్ అధ్యక్షులు తాత మధు తదితరులు వారి సంతాపం తెలియజేశారు. కమల్ రాజు కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ , వారికి భగవంతుడు ధైర్యాన్ని ప్రసాదించాలని ఆకాంక్షించారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని జడ్పీటీసీలు, ఎంపీపీలు, శాసనసభ్యులు తదితరులు కమల్ రాజ్ మాతృమూర్తి పరమపదించడం పట్ల తమ సంతాపాన్ని , సానుభూతిని తెలియజేశారు.
