ఖమ్మం పై మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తన ముద్ర వేసుకున్నారు.. నగర అభివృద్ధి తో పాటు నియోజకవర్గ అభివృద్ధి చరిత్రలో తనకంటూ ఓ పేజీని సృష్టించుకున్నారు..
ఖమ్మం నియోజకవర్గం బి.ఆర్.ఎస్ కు పెట్టని కోటగా ఆ పార్టీ నేతలు భావిస్తున్నారా అంటే పెట్టని కోటే అనుకుంటున్నట్లు తెలుస్తోంది రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ నియోజకవర్గ ప్రజలతో కూడా అన్ని విధాలుగా మంచి సంబంధాలతో పట్టు బిగించారని అభిప్రాయాలు పరిశీలకులు ఉన్నాయి.. అందుకే ఆయనపై పోటీ చేసి గట్టి పోటీని ఇవ్వగల అభ్యర్థి కోసం కాంగ్రెస్ కసరత్తు చేస్తోంది. అభివృద్ధి మాత్రమే ప్రధాన ఎజెండాగా పువ్వాడ అజయ్ కుమార్ ఖమ్మం ఖిల్లా ఫై జెండా ఎగరేయడం ఖాయమని ఆ పార్టీ వర్గాలు గంటపదంగా చెబుతున్నాయి..

ప్రధానమైనవి ఐటి హబ్ రెండవది జిల్లా కేంద్రంలో ప్రభుత్వ మెడికల్ కాలేజీ మూడవది ప్రభుత్వ ఇంజనీరింగ్ కాలేజీ వరదలు వస్తే వేలమంది భయంతో వణికి పోతారు అలాంటి మున్నేరు వరద ముప్పుకు శాశ్వత రక్షణ కల్పిస్తున్నారు… 500 కోట్ల రూపాయలతో ఖమ్మం చరిత్రలో మిగిలిపోయేలా రక్షణ గోడ నిర్మిస్తున్నారు… దాదాపు కొన్ని కిలోమీటర్ల మేర ఖమ్మం నగరంలో అత్యంత దుర్గంధం వెదజల్లిన గొల్లపాడు ఛానల్ ప్రక్షాళన గావించారు.. దుర్గంధం వెదజల్లే కాల్వలను కోట్ల రూపాయలు నిధులతో సుగంధ పరిమళాలు వెదజల్లే ఉద్యాన వనాలుగా మార్చి నగర ప్రజల మనసుల్లో శాశ్వత స్థానం పొందారు… మురికి కూపన్లా ఉన్న లకారం చెరువును సుందర ప్రదేశంగా తీర్చిదిద్దారు.. ఇవి స్థూలంగా కనిపించే ఖమ్మం నగర రూపురేఖలను మార్చి వేసిన అసాధ్యమైన పనులుగా చెప్పవచ్చు…
….. ఖమ్మం మణిహారంగా , మారిన లకారం…

నగరం నడిబొడ్డున మురికి కోపంగా ఉన్న లకారం చెరువు సుందర పర్యాటక కేంద్రంగా మారింది నగర ప్రజలు సేద తీరే వరప్రదాయినిగా రూపాంతరం చెందింది. కోట్లాది రూపాయలు ఖర్చుతో ఖమ్మం నగరానికి తిరుగులేని మకుటంలా మార్చారు…ప్రతిరోజు వేలాదిమందికి ఆహ్లాదాన్ని పంచే నందనవనమైంది. పర్యాటకులు నువ్వు ఆకర్షించే కేబుల్ బ్రిడ్జి తో పాటు రాత్రిపూట మిరుముట్లు గొలిపే విద్యుత్ దీపాలతో లకారం వెలిగిపోతుంది ఈ అసాధ్యాలన్నీ అజయ్ కుమార్ తనదైన శైలిలో పనిచే సి సుసాధ్యం చేశారు…
….. బి ఆర్ ఎస్ కు ఖమ్మం దుర్భేద్యమైన కోటగా ఉందా..

నగరంలో వినూత్నమైన పెద్ద పెద్ద ప్రాజెక్టులను తీసుకొచ్చి శాశ్విత అభివృద్ధికి చిరునామాగా ఖమ్మం ప్రాంతాన్ని పువ్వాడ అజయ్ కుమార్ కృషితో మార్చారనే అభిప్రాయం నగర ప్రజల్లో ఉంది. ఆయన పనితీరుతో సంక్షేమ పథకాల అమలులోను నూరు శాతం లబ్ధిదారులకు చేరే విధంగా ఆయన కృషి చేశారని పేరు కూడా సంపాదించుకున్నారు. అందుకే ఉమ్మ డి ఖమ్మం జిల్లాలో ఖమ్మం నియోజకవర్గం బి.ఆర్.ఎస్ కు దుర్వేద్యమైన కోటగా సాక్షాత్తు ముఖ్యమంత్రి కేసీఆర్ ఏ భావిస్తున్నట్లు ప్రచారంలో ఉంది. మంత్రి అజయ్ కుమార్ సీఎం కేసీఆర్ మంత్రి కేటీఆర్ హరీష్ రావుల సహకారంతో ఖమ్మం నియోజకవర్గంలో ప్రత్యేకమైన శ్రద్ధతో అభివృద్ధి కార్యక్రమాలు పూర్తిచేస్తూ అజయ్ కుమార్ ప్రజల మన్ననులు పొందుతున్నార నే అభిప్రాయాలు ఉన్నాయి.

ఇక నగరంలో రోడ్లు కల్వర్టులు డివైడర్లు సెంట్రల్ లైటింగ్ లు ఆర్టీసీ బస్టాండ్ లో భారీ షాపింగ్ కాంప్లెక్స్ ఏర్పాట్లు నగరంలో వినూతనమైన మార్కెట్ల నిర్మాణాలు ఇలా చెప్పుకుంటే వాటి జాబితా చాంతాడంత ఉందని నగరవాసులు అంటున్నారు. మొత్తం మీద పువ్వాడ అజయ్ కుమార్ ఖమ్మం నగరాభివృద్ధి తో పాటు నియోజకవర్గ అభివృద్ధిపై తన ముద్ర వేసుకున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి
వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ముఖ్యమంత్రి కెసిఆర్ తో సహా ఆ పార్టీ అగ్ర నేతలు కూడా ఖమ్మం నియోజకవర్గం గులాబీ పార్టీకి పెట్టని కోట అనే భావనలో ఉన్నట్లు ప్రచారం జరుగుతుంది పువ్వాడ అజయ్ గెలుపును అడ్డుకోవడం విపక్షాలకు కష్టమనే అభిప్రాయాలు వారు వ్యక్తం చేస్తున్నారు.
