ఆంధ్రప్రదేశ్ జాతీయం తెలంగాణ రాజకీయం

కౌ లు రైతులు, వ్యవసాయ కూలీలపై కాంగ్రెస్ ఫోకస్…సోనియా స్కీములపై సర్వత్రా చర్చ…గ్యారంటీ కార్డులతో ప్రతి ఇంటికి కాంగ్రెస్ నినాదం…

Written by Mohiddin Shaik

తెలంగాణ ప్రభుత్వం పట్టించుకోని కౌ లు రైతులు, వ్యవసాయ కూలీల కుటుంబాల పై కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా ఫోకస్ పెట్టిందని పలువురు అంటున్నారు. సోనియా గాంధీ చేతులు మీదుగా ప్రారంభించిన ప్రకటించబడిన గ్యారంటీ స్కీములు ప్రజలను ఏ మేరకు ఆకర్షిస్తాయో తర్వాత సంగతి కానీ కౌలు రైతులకు వ్యవసాయ కూలీలకు రైతు భరోసా స్కీం కింద ఏడాదికి 12,000 నగదు ఇచ్చే పథకం ఖచ్చితంగా ఆయా వర్గాలను ఆకర్షిస్తుందని పలువురు పేర్కొంటున్నారు . రైతు భీమా రైతు బంధు ఈ పథకాలు కేవలం వ్యవసాయ భూమి కలిగిన యజమానికి మాత్రమే వస్తున్నాయి కానీ ఆయా భూముల్లో నష్టాలు గూర్చి కవులు చెల్లించి వ్యవసాయం చేసి ఆత్మహత్యలు పాలవుతున్న నిజమైన రైతులకు ఎంత మాత్రం ఆ పథకం ప్రయోజన కార్యగా లేదని వేరే చెప్పనక్కరలేదు. కెసిఆర్ ప్రభుత్వం ఇస్తున్న రైతుబంధు వందల ఎకరాలు ఉన్న భూస్వాములు కూడా అందుతుంది కానీ భూమిలేని రైతులు భూమి యజమాను యజమానుల దగ్గర కౌలుకు తీసుకొని వ్యవసాయంపైనే ఆధారపడి జీవించే కౌలు రైతులకు మాత్రం ఒక్క రూపాయి కూడా చేరడం లేదు.

దీనిపై కేసీఆర్ ప్రభుత్వం పై విమర్శ ఉంది. పక్క రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్లో కౌలు రైతులకు కూడా రైతు భరోసా నిధులు అందుతుండగా తెలంగాణలో మాత్రం కౌలు రైతును రైతుగా ప్రభుత్వం గుర్తించడమే లేదు. దీన్ని గమనించిన కాంగ్రెస్ కౌలు రైతులను ఆకట్టుకునేందుకు వారికి కూడా రైతు భరోసా కింద ఎకరానికి 12 వేల చొప్పున ఇస్తామని వాగ్దానం చేసింది. ఆదివారం హైదరాబాద్ తుక్కుగూడ లో జరిగిన భారీ విజయభేరి బహిరంగ సభలో సోనియా గాంధీ ఆయా స్కీములను ప్రకటించారు.

….. రాష్ట్రవ్యాప్తంగా 30 లక్షల వరకు కౌలు రైతులు…

రైతుబంధు నిధులు అందుకుంటున్న బడా రైతులంతా తమ భూములు కౌలుకు ఇచ్చి వేరే వ్యాపారాలు చేసుకునే వారే ఎక్కువ. నిజానికి వారికి పంట సాయం అక్కరలేదు వారు ఆత్మహత్యలు చేసుకోకుండా ధైర్యం కల్పించాల్సిన అవసరం ప్రభుత్వానికి అసలే లేదు. కానీ ఒక చేతితో ప్రభుత్వం ఇచ్చే పంట సాయం చెక్కు మరో చేత్తో భూమికి కవులు రైతు చెల్లించే కవులు డబ్బు ఈ రెండు ప్రయోజనాలను బడా రైతులు ఇప్పటివరకు పొందుతున్నారు. అయితే రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 40 లక్షల మంది వరకు కౌలు రైతులు ఉన్నారని రైతు సంఘాలు పేర్కొంటున్నాయి ఆయా కుటుంబాలకు రైతు భరోసా ఇచ్చి ఆదుకోవాలని అనేకసార్లు ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన సందర్భాలు ఉన్నాయి కానీ ఆ డిమాండ్ ను తెలంగాణ సర్కారు పట్టించుకోలేదు ఇప్పుడు తాజాగా కాంగ్రెస్ తీసుకున్న నిర్ణయంతో కౌలు రైతు కుటుంబాలతో పాటు వ్యవసాయ కూలీ కుటుంబాలు కూడా కాంగ్రెస్ పథకానికి ఆకర్షితులవడం ఖాయం అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

… జనంలోకి ఇందిరమ్మ ఇండ్లు నినాదం…

కెసిఆర్ ప్రవేశపెట్టిన డబల్ బెడ్ రూమ్ ఇండ్ల స్కీం చాలా ఆలస్యంగా అమలవుతోంది. రాష్ట్రంలో ఉన్న ఇండ్లు లేని పేదలందరికీ డబల్ బెడ్ రూమ్ కట్టించాలంటే 100 సంవత్సరాలు కట్టిన అందరికీ అందవని అభిప్రాయాలు విపక్ష పార్టీలే గాక అనేకమంది లబ్ధిదారులు కూడా వ్యక్తం అవుతున్నాయి. ఈ తరుణంలో ఇందిరమ్మ ఇల్లు పేరుతో కాంగ్రెస్ గ్యారంటీ స్కీముగా తీసుకొస్తున్న ఇంటికి రూపాయలు ఐదు లక్షలు ఇచ్చే పథకం పట్ల కూడా ప్రజలు ఆకర్షితులయ్యే అవకాశాలు ఉన్నాయి. వంట గ్యాస్ ధరను మోడీ ప్రభుత్వం 12 00 రూపాయలకు చేర్చిన తరుణంలో గ్యాస్ సిలిండర్ ధర కాంగ్రెస్ 500 కే ఇస్తాను అనటం కూడా ప్రజలను ఆకర్షించే అవకాశం ఉందని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. ఆరోగ్యశ్రీ కార్డు పై వైద్యం అనేకమందికి అందటం లేదనే విమర్శలు వినిపిస్తున్న వేళ రాజు ఆరోగ్యశ్రీ కింద పది లక్షల వరకు వైద్య సహాయం అందించే కాంగ్రెస్ పథకం కూడా ప్రజల్లోకి వెళుతుందని పలువురు అంటున్నారు. ఆసరా పింఛన్లు దేశంలోనే ఎక్కువగా డబ్బు కూడా ఎక్కువ మొత్తంలో తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే ఇస్తుంది. అయినప్పటికీ ప్రతి కుటుంబంలో ఒక మహిళకు నెలకు ₹2,500 ఇస్తామని చేస్తున్న వాగ్దానం కూడా మహిళలను ఆకర్షించే అవకాశం ఉంది టి ఎస్ ఆర్ టి సి లో ఫ్రీగా ప్రయాణం చేసే అవకాశం కల్పిస్తామని వాగ్దానం కూడా మహిళలను ఆకట్టుకునే అవకాశం ఉందని పలు రా అంటున్నారు

….. తెలంగాణ కోసం పోరాడిన వారికి 250 చదరపు గజాల ఇంటి స్థలం….

పేదలకు ఇండ్లు ఇండ్ల స్థలాలు ఇవ్వడంతో పాటు తెలంగాణ సాధనలో జరిగిన పోరాటంలో పాల్గొన్న వారికి 250 చదరపు గజాల ఇంటి స్థలాన్ని ఇస్తామని కాంగ్రెస్ వాగ్దానం చేసింది. 200 యూనిట్ల వరకు ఉచితంగా ఇండ్లకు విద్యుత్తు ఇవ్వడం, విద్యార్థుల చదువులకు ఐదు లక్షలు ఇచ్చే వాగ్దానం, అంతర్జాతీయ స్థాయి విద్యాసంస్థలు ఏర్పాటు చేస్తామనే వాగ్దానం వంటివి విద్యార్థి లోకాన్ని ప్రభావితం చేసేవిగా ఉన్నాయని కొందరు అంటున్నారు.
..

.. … కెసిఆర్ ఇప్పటికే అనేక పథకాలు అమలు చేస్తున్నారు…

కెసిఆర్ ప్రభుత్వం ఇతర రాష్ట్రాల్లో ఎక్కడ అమలు జరగని అనేక సంక్షేమ పథకాలను ఇప్పటికే అమలు చేస్తోంది అయితే కాంగ్రెస్ తాజాగా ప్రకటించిన డిక్లరేషన్లకు దీటుగా కొత్తగా ఆయన కూడా కొన్ని పథకాలను ప్రకటిస్తారని ప్రచారం జరుగుతోంది . దళిత బంధు బీసీ బందు కెసిఆర్ కిట్టు కళ్యాణ లక్ష్మి, ఒంటరి మహిళలకు పింఛను వికలాంగులు, చేనేత కార్మికులు, బోధకాలు పీడితులకు సైతం కేసీఆర్ ప్రభుత్వం ఆసరా పింఛన్లు పెద్ద ఎత్తున ఇస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రకటించిన గ్యారెంటీ స్కీములు ఇప్పటివరకు ఇస్తున్న కెసిఆర్ పథకాలకు అదనంగా ఇస్తారా, లేక వాటిని పక్కన పెట్టి ఇవి మాత్రమే ఇస్తారా , అని బి ఆర్ ఎస్ నేతలు కొందరు ప్రశ్నిస్తున్నారు. మొత్తం మీద హైదరాబాదులో సిడబ్ల్యుసి సమావేశాల తర్వాత ఆదివారం జరిగిన సోనియాగాంధీ స్వయంగా పాల్గొన్న చారిత్రక కాంగ్రెస్ సభ డిక్లేర్ చేసిన స్కీములు ప్రజల్లోకి వెళతాయా, వాటి ద్వారా కాంగ్రెస్ ఈ రాష్ట్రంలో అధికారంలోకి వస్తుందా, లేక సాగునీటి ప్రాజెక్టుల తో సహా , ఉచిత కరెంటు సరఫరాతో సహా, అనేక స్కీములు ఇప్పటికే అమలు చేస్తున్న టిఆర్ఎస్ వైపే ప్రజలు నిలబడతారా చూడాల్సి ఉంది.

About the author

Mohiddin Shaik

Leave a Comment