ఒకనాడు తెలంగాణ ప్రాంతంలో స్వేచ్ఛ వాయువులు పీల్చుకునే పరిస్థితి లేదు.. నైజాం నిరంకుశ పాలనలో ప్రజలు ఇబ్బందులు పడ్డారు స్వేచ్ఛను కోరుకున్నప్పుడు నైజాం సేనలతో పాటు ప్రైవేటు సైన్యంగా చేరిన రజాకారు ముష్కరులు ప్రజల ప్రాణాలను అడ్డగోలుగా తీశారు.. ఆ రజాకార్లను ఆ నైజాం సేనలను తరిమికొట్టిన వీరోచిత చరిత్ర ఎవరిది… భూమికోసం భుక్తి కోసం జమీందారుల నుంచి విముక్తి కోసం ఎర్రజెండా అండతో సాయుధ పోరాటం చేసి వందలాదిమంది కమ్యూనిస్టు కార్యకర్తలు ప్రాణాలు త్యాగం చేసి, రక్త తర్పణం చేస్తే ఈ రజాకారు ముష్కరులు నైజాం సేనలు పారిపోయిన చరిత్ర.. ఈ మహోద్యమ వారసత్వం ముమ్మాటికి కమ్యూనిస్టులదే నాడు ఆ ఉద్యమంతో ఎంత మాత్రం సంబంధంలేని కొన్ని పార్టీల నేతలు ముష్కరులైన రజాకారులను తామే పారదూలినట్టు ఆ ఉద్యమం రైతాంగ ఉద్యమం స్వేచ్ఛ కోసం సాగిన ఉద్యమం అనే చరిత్రను వక్రీకరించి అదేదో హిందూ ముస్లిం ఉద్యమంగా వక్రీకరించడానికి ఆ ఉద్యమం ఏదో తమ ద్వారా తమ వల్లే జరిగిందని హైజాక్ చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారని భారత కమ్యూనిస్టు పార్టీ రాష్ట్ర కార్యదర్శి కూనం నేని సాంబశివరావు ఆరోపించారు.

సాంబ శివరావు ఖమ్మం లో జరిగిన పాత్రికేయుల సమావేశంలో తెలంగాణ సాయుధ పోరాట ఉద్యమ చరిత్ర పై అనేక విషయాలు తెలిపారు. నైజాం నవాబుకు తొత్తులుగా ఉన్న జమీందారులు జాగిరి దారుల చేతుల్లో బంధీగా ఉన్న దాదాపు పది లక్షల ఎకరాల భూములను ఎర్రజెండాలు పాతి వారి గడీలు బద్దలు కొట్టి పేదలకు ఆ భూములను పంచిన చరిత్ర కమ్యూనిస్టుల ది మాది అని ఆయన పేర్కొన్నారు.. ప్రపంచ పోరాటాల చరిత్రలో తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం ఒక పుటను కలిగి ఉందని ఆయన గుర్తుచేస్తూ, ఈ విషయాలను కమ్యూనిస్టుల మహోన్నత త్యాగాలను నేడు ప్రజలు గుర్తించాలని , ప్రధానంగా యువత గమనించాలని ,తెలుసుకోవాలని ఆయన కోరారు.
…మత ఘర్షణలు సృష్టించేందుకే బిజెపి ప్రయత్నిస్తుందన్నారు….
ఇటీవల కాలంలో చరిత్రను వక్రీకరించడంలో ముందు భాగాన నిలిచిన బిజెపి తెలంగాణ చరిత్రను కూడా వక్రీకరిస్తుందని తెలంగాణ సాయుధ పోరాటం భూమి, భూక్తి, విముక్తి కోసం జరిగిందని కానీ బిజెపి హిందు, ముస్లిం పోరాటంగా చూపించేందుకు ప్రయత్నిస్తుందన్నారు. అమితాకు తెలంగాణ సాయుధ వార్షికోత్సవాలతో ఏమి పని అని ఆయన ప్రశ్నించారు. కేవలం మత ఘర్షణలు సృష్టించేందుకే బిజెపి ప్రయత్నిస్తుందన్నారు. వల్లభాయ్ పటేల్ గురించి మాట్లాడుతున్నారని పటీల్ నిజాంతో యుద్ధం చేస్తే రాజ ప్రముఖ్ అని బిరుదు ఎందుకు ఇచ్చారని నర హంతకుడు ఖాసింరజ్విని సాధారంగా పాకిస్తాన్కు ఎందుకు పంపించారని సాంబశివరావు ప్రశ్నించారు. రాజభరణాలు ఇచ్చి అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం గౌరవించిందని సాయుధ పోరాటం పోసేత్తే హక్కు కమ్యూనిస్టులకు మినహా మరెవరికి లేదన్నారు. తెలంగాణ తొలి అమరవీరుడు దొడ్డి కొమరయ్య ఆ తర్వాత బందగి తన రాతలతో చైతన్య పరిచి శిక్షకు గురైన సోయబుల్లాఖాన్ వీరంతా ముస్లింలు ఔనో కాదో తేల్చుకోవాలన్నారు. కమ్యూనిస్టుల సాయుధ పోరాట ఫలితంగానే 10 లక్షల ఎకరాల భూమి పంచబడిందని మూడు వేల గ్రామాలు విముక్తి చెందాయన్నారు. బిజెపి విముక్తి కానీ, కేసిఆర్ సమైక్యత కానీ ఓట్ల కోసం తప్ప ప్రజల కోసం కాదన్నారు. 2001 వరకు త్రివర్ణ పతాకాన్ని గౌరవించని ఆర్ఎస్ఎస్ దాని ప్రధాన సంస్థ బిజిపి సమైక్యత గురించి, దేశం గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. బిజెపి ఉత్సవాలు, నినాదాల వెనుక కుట్ర దాగి ఉందన్నారు. నిజాం ప్రభుత్వం కంటే కాంగ్రెస్ వారే ఎక్కువ మంది కమ్యూనిస్టులను చంపారని ఆయన తెలిపారు. చనిపోయిన వారిలో ముస్లింలు కూడా ఉన్నారన్న విషయాన్ని తెలుసుకోవాలన్నారు. సమైక్యత దినం ఎందుకో కేసిఆర్ చెప్పాలని సాంబశివరావు డిమాండ్ చేశారు. ఖాసింరజ్వీ స్థాపించిన ఎంఐఎం పార్టీని కొనసాగిస్తున్నారని వారికి కోపం వస్తుందనే కేసిఆర్ తన పంథాను మార్చుకున్నారన్నారు. సమైక్య రాష్ట్రంలో గొంతు చించుకున్న కేసిఆర్ ఇప్పుడు ఎందుకు మాట్లాడటం లేదని ఆయన ప్రశ్నించారు.
కేసిఆర్ ఇప్పుడు ఎందుకు మాట్లాడటం లేదని ఆయన ప్రశ్నించారు. కేసిఆరు తెలంగాణ ప్రజల కంటే తెలంగాణ ఓట్ల మీదే ప్రేమ ఎక్కువ అన్నారు. తెలంగాణ పోరాటాలు, బలిదానాల వెనుక ఉన్న త్యాగాలను కూడా వక్రీకరిస్తున్నారన్నారు. జమిలీ ఎన్నికలను సిపిఐ వ్యతిరేకిస్తుందన్నారు. బలవంతపు జమిలి ఎన్నికలు ప్రజాస్వామ్య, స్ఫూర్తికి విరుద్ధమని సాంబశివరావు తెలిపారు. పాలకులు రాజ ధర్మాన్ని మరచిపోతున్నారని, ప్రశ్నించే వారిని అణచివేస్తున్నారని ఆయన తెలిపారు. రాజకీయ ప్రయోజనాల కోసం ఎంతకైనా తెగిస్తున్నారని ఎఫ్ఎఆర్లో పేరు లేకుండా చంద్రబాబును అరెస్టు చేయడాన్ని తాము ఖండిస్తున్నామన్నారు.
మీడియా సమావేశంలో సిపిఐ జాతీయ సమితి సభ్యులు బాగం హేమంతరావు, జిల్లా కార్యదర్శి పోటు ప్రసాద్, సహాయ కార్యదర్శి దండి సురేష్. రాష్ట్ర సమితి సభ్యులు జమ్ముల జితేందర్రెడ్డి, సిద్దినేని కర్ణకుమార్ తదితరులు పాల్గొన్నారు.
