తెలంగాణ రాష్ట్ర రాజధాని భాగ్యనగరం జాతీయ రాజకీయాలకు దిశా నిర్దేశం చేసే కీలక నిర్ణయాలకు వేదికగా మారనుంది… ఇండియా కూటమికి నేతృత్వం వహిస్తున్న జాతీయ కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సిడబ్ల్యుసి సమావేశాలకు హైదరాబాద్ వేదిక అయింది… ఈనెల 15, 16, 17 తేదీల్లో సిడబ్ల్యుసి ప్రతిష్టాత్మకమైన సమావేశం హైదరాబాదులో జరుగుతుంది… 17న విజయభేరి పేరుతో జాతీయ అతిరథ మహారథ నేతలు పాల్గొని భారీ బహిరంగ సభ జరగనుంది.. ఒకపక్క సోనియా రాహుల్ మల్లికార్జున ఖర్గే తుపాను కాంగ్రెస్ మహా నేతలు పాల్గొనే బహిరంగ సభ జరుగుతుండగా, అదేరోజు మరోపక్క తెలంగాణ విమోచన దినోత్సవాల సందర్భంగా జరిగే సభలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా పాల్గొంటున్నారు… ఒకపక్క కాంగ్రెస్ మహా ర్యాలీ నిర్వహిస్తుండగా మరోపక్క బిజెపి ఆధ్వర్యంలో తెలంగాణ విమోచన ఉత్సవాలు జరగనున్నాయి… దీంతో హైదరాబాదు నగరం జాతీయ రాజకీయ పార్టీల జెండాల రెపరెపలతో సందడిగా మారనుంది…
కాంగ్రెస్ పార్టీ హైదరాబాదులో అత్యంత ప్రతిష్టాత్మకమైన సిడబ్ల్యుసి సమావేశాలు నిర్వహించడం ద్వారా దేశ రాజకీయాలకు ఆ పార్టీ అనుసరించబోయే వ్యూహాలు విధానాలకు సంబంధించి దిశా నిర్దేశం చేయనున్నాయి. ఈనెల 17న స్వర్గీయ మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన విజయభేరి భారీ బహిరంగ సభ వేదికగా కాంగ్రెస్ ఓటర్లను ఆకట్టుకునేందుకు భారీ వ్యూహాన్ని అమలు చేయబోతోంది. అదేమంటే కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఓటర్లకు కొన్ని హామీలతో కూడిన గ్యారంటీ కార్డును అందజేసేందుకు వ్యూహరచన చేసింది. ఆ గ్యారెంటీ కార్డును సోనియా గాంధీ చేతులు మీదుగా విడుదల చేసి ఆ కార్డును దేశవ్యాప్తంగా హైదరాబాద్కు వచ్చిన కాంగ్రెస్ నేతలు ద్వారా 119 నియోజకవర్గాల్లో స్థానిక నేతలతో కలిసి ఓటర్లకు అందజేస్తారట. ఆ గ్యారెంటీ కార్డులో ఇచ్చిన హామీలు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తరువాత 100 రోజుల లోపు లోనే అమలు చేస్తామని కాంగ్రెస్ హామీ ఇస్తోంది. ఇదే వ్యూహాన్ని కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లోను కాంగ్రెస్ అమలు చేసి ఓటర్లను ఆకట్టుకుంది. తెలంగాణలో కూడా అదే వ్యూహాన్ని పకడ్బందీగా అమలు చేయడం ద్వారా ఓటర్లను ఆకట్టుకోవాలని కాంగ్రెస్ భావిస్తోంది. రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో పకడ్బందీగా గ్యారంటీ కార్డు ఇచ్చే నెపంతో కాంగ్రెస్ ప్రతి ఓటర్ ని కలవనుంది
…ఓటర్లకు దగ్గరయ్యే యుహం….

రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో పకడ్బందీగా గ్యారంటీ కార్డు ఇచ్చే నెపంతో కాంగ్రెస్ ప్రతి ఓటర్ ని కలవనుంది. తద్వారా ఆ పార్టీ ఓటర్లకు దగ్గర అవుతుందని ఈ వ్యూహం వల్ల కాంగ్రెస్కు మేలు జరుగుతుందని కొంతమంది పరిశీలకులు కూడా పేర్కొంటున్నారు. గ్యారంటీ కార్డు పట్ల ఓటర్లలో ఎంత శాతం మంది ఆకర్షితుల అవుతారో తర్వాత సంగతి కానీ ముందుగా కార్డు పేరుతో కాంగ్రెస్ ఇప్పటినుంచే తన ఎన్నికల వ్యూహాన్ని ప్రచారాన్ని విస్తృతస్థాయిలో చేపట్టినట్టు అవుతుందని కొందరు అంటున్నారు. గ్యారెంటీ కార్డులు ఇచ్చిన హామీల అమలు విషయంలో కర్ణాటకలో గ్యారెంటీ కార్డు ఇచ్చి తమ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల గురించి కాంగ్రెస్ నేతలు ఓటర్లకు వివరించనున్నారు. తద్వారా వారి నమ్మకాన్ని పొందేందుకు గట్టి ప్రయత్నం చేయబోతున్నారు. ఇతర పార్టీల నుంచి కాంగ్రెస్ లోకి చేరికలు జరుగుతున్న సందర్భంలోనే వామపక్ష పార్టీలతో కూడా ఎన్నికల పోతు కుదురుతుంది అనే ప్రచారం జరుగుతోంది. మంగళవారం సీఎల్పీ నాయకుడు బట్టి విక్రమార్క మాట్లాడుతూ కమ్యూనిస్టులతో పొత్తు అది జాతీయ స్థాయి అంశమని జాతీయస్థాయి కమిటీ విషయంలో నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు. అయితే తెలంగాణ కాంగ్రెస్ కమిటీ కమ్యూనిస్టులతో పొత్తును కోరుకుంటుందని ఆయన స్పష్టం చేశారు.
…. పొత్తులపై సిడబ్ల్యుసి లో స్పష్టత రావచ్చు..

బి ఆర్ఎస్ తో స్నేహానికి అడుగులు వేసి భంగపడ్డ వామపక్ష పార్టీలు కాంగ్రెస్తో జతకట్టేందుకు ఇప్పటికే ఓ నిర్ణయానికి వచ్చాయి. కాంగ్రెస్ స్నేహ హస్తం అందిస్తున్న తరుణంలో ఆ పార్టీలు కాంగ్రెస్తో చేయి కలపడం దాదాపు ఖాయమనే సంకేతాలు వస్తున్నాయి. ఈనెల 15 నుంచి 17 వరకు జరిగే సి డబ్ల్యూ సి సమావేశాల్లోనే కమ్యూనిస్టులతో పొత్తు వ్యవహారంపై కూడా కాంగ్రెస్ స్పష్టతనిచ్చే అవకాశం ఉంది. మొత్తం మీద తెలంగాణపై కాంగ్రెస్ పార్టీ పటిష్టమైన వ్యూహాలతో ఎన్నికల బరిలోకి దిగుతున్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది…
తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ ఇచ్చే హామీలను నమ్ముతారా, , లేక ప్రస్తుతం బి ఆర్ఎస్ అమలు చేస్తున్న పథకాలు పాలన విధానాలు పట్ల ప్రజలు నమ్మకంతో తిరిగి గులాబీ పార్టీని గెలిపిస్తారో వేచి చూడాలి.
