నేను నిప్పులాంటి వాడిని , నా 40 ఏళ్ల రాజకీయ జీవితంలో తప్పు చేయలేదు అంటూ చంద్రబాబు నాయుడు ఎప్పుడు గట్టిగా చెబుతుంటారు… ఆ నిప్పుకు ఇప్పుడు చెదలు పట్టిందా ..లేక చెదలు పట్టినట్టు చూపించే ప్రయత్నం జరుగుతుందా… విచారణ సంస్థలు మాత్రం మాజీ సీఎం తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు ఉద్దేశ పూర్వకంగానే స్కిల్ డెవలప్మెంట్ పేరుతో బోగస్ కంపెనీల ద్వారా 300 కోట్ల రూపాయలు స్వాహా చేశారని ఆరోపించాయి… ఈ కుంభకోణంపై 2021 నుంచే విచారణ ప్రారంభించి సుదీర్ఘంగా విచారించి , అన్ని ఆధారాలతో చంద్రబాబు నాయుడు ను అరెస్టు చేశామని చెబుతున్నాయి. కానీ తెలుగుదేశం పార్టీ నాయకులు మాత్రం చంద్రబాబు నాయుడు ఏ తప్పు చేయకుండానే రాజకీయ దురుద్దేశంతో ఆయనను అరెస్టు చేశారని, ఇది జగన్ ప్రభుత్వం చేస్తున్న దాడి అని ఆరోపిస్తున్నారు. సుదీర్ఘ కాలం పాటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు ముఖ్యమంత్రిగా ను, రాష్ట్రం విడిపోయిన తర్వాత ఆంధ్ర రాష్ట్రానికి ఒక పర్యాయం ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు పనిచేశారు. అదేవిధంగా గతంలో ఎన్డీఏ భాగస్వామిగా ఉండి ఢిల్లీ రాజకీయాలను సైతం ప్రభావితం చేయగలిగిన రాజకీయ చతురుడుగా కూడా చంద్రబాబు నాయుడుకు పేరుంది. అలాంటి నాయకుడు అవినీతి ఆరోపణలపై పలు కేసులను ఎదుర్కోవడమే కాకుండా , శనివారం అరెస్టు కావడంతో ఆంధ్ర రాష్ట్రం తో పాటు తెలుగుదేశం పార్టీ శ్రేణులు తెలంగాణ రాష్ట్రంలో కూడా పెద్ద ఎత్తున ఆందోళనలకు దిగారు. చంద్రబాబు నాయుడు పై ఉన్న కేసులు న్యాయస్థానం ముందు నిలుస్తాయా, లేదా అనేది న్యాయవిచారణ జరిగిన తర్వాతనే త్యాలనుంది . అయితే ఇది పెద్ద ఎత్తున జరిగిన ఆర్థిక నేరానికి సంబంధించిన కేసు కావడంతో త్వరలో ఎన్నికలు జరగనున్న తరుణంలో ఈ పరిణామాలు తెలుగుదేశం పార్టీలో ఆందోళన కలిగిస్తున్నాయి. శనివారం తెల్లవారుజామున నంద్యాలలో పోలీసులు చంద్రబాబు నాయుడును అరెస్టు చేసి విజయవాడలోని ఏసీబీ కోర్టులో హాజరు పరుస్తున్నారు.
ఈ కేసులో జిఎస్టి , ఈడి , కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నట్లు సంజయ్ పాత్రికేయుల సమావేశంలో పేర్కొన్నారు . కేసు పూర్తి వివరాలను ఆయా సంస్థలకు కూడా
…. చంద్రబాబు అరెస్టుపై భిన్నవాదాలు….

స్కిల్ డెవలప్మెంట్ కంపెనీలో అవకతవకలు జరిగితే చంద్రబాబుకు అరెస్టు చేయాల్సిన అవసరం లేదని ఆ కంపెనీ , బాధ్యులను విచారిస్తే సరిపోతుందని కొందరు వాదిస్తుండగా, విచారణ సంస్థలు ముందుగా ఆ సంస్థ బాధ్యులను విచారించిందని, ఈ మొత్తం డబ్బులు తమ సంస్థ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఇవ్వలేదని , ఇవ్వబోదని కూడా సీమన్ కంపెనీ చైర్మన్ కోర్టు ముందుకు వచ్చి స్పష్టమైన వివరణ ఇచ్చారని వైసిపి నాయకులు అంబటి రాంబాబు మీడియాతో చెప్పారు. ఒక ప్రైవేటు సంస్థ ప్రభుత్వానికి 90 శాతం నిధులు వందల కోట్లు ప్రభుత్వ అభివృద్ధి కోసం ఎలా ఇస్తుందని ఆయన ప్రశ్నించారు. చంద్రబాబు నాయుడు ఖాతాలోకి వందల కోట్లు వివిధ కంపెనీల పేర్లు మీద రిలీజ్ అయి చుట్టూ తిరిగి తన ఖాతాలోకి ఎలా వచ్చాయని రాంబాబు ప్రశ్నిస్తున్నారు . ఇదే అంశంపై విచారణ సంస్థలు లోతుగా విచారణ జరిపి అన్ని ఆధారాలతో చంద్రబాబు నాయుడు ని అరెస్టు చేశారని తప్పు చేసిన వ్యక్తికి శిక్ష తప్పదని అందుకు తగిన చర్యలు ఏమి తీసుకోవాలో , న్యాయస్థానాలు నిర్ణయిస్తాయని ఆయన పేర్కొన్నారు
…. నారా లోకేష్ ను కూడా అరెస్టు చేస్తారా….

ఇదిలా ఉంటే ఏపీ ఫైబర్ టెక్ రింగు రోడ్డు కుంభకోణాల్లో నారా లోకేష్ కు ఆయన సన్నిహితుడు కిలారు రాజేష్ కు సంబంధాలు ఉన్నాయని వారిని కూడా కచ్చితంగా విచారిస్తామని సిఐడి చీఫ్ సంజయ్ ప్రకటించారు అంటే నారా లోకేష్ ను కూడా పోలీసులు అరెస్టు చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. దీంతో టిడిపి వర్గాల్లో ఆందోళన వ్యక్తం అవుతోంది. బోగస్ కంపెనీల ద్వారా చేతులు మారిన డబ్బు హవాలా ద్వారా ఆంధ్రకు వచ్చి చంద్రబాబు నాయుడు ఖాతా తో పాటు , నారా లోకేష్ బ్యాంకు ఖాతాలోకి కూడా డబ్బు ట్రాన్స్ఫర్ అయినట్లు సంజయ్ పేర్కొన్నారు.. వీటన్నిటి నేపథ్యంలో లోకేష్ అరెస్టుకు కూడా పోలీసులు రంగం సిద్ధం చేస్తున్నారని ఊహాగానాలు ఊపు అందుకున్నాయి. తెలుగుదేశం పార్టీలో సంచలనాత్మకంగా సంభవించిన పరిణామాలతో రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ రాజకీయ వర్గాల్లో విస్తృతంగా చర్చ జరుగుతోంది. చంద్రబాబు నాయుడు అరెస్టుపై కోర్టు ఏ విధమైన నిర్ణయం తీసుకుంటుందో బెయిల్ మంజూరు చేస్తుందా? అరెస్టును రద్దు చేస్తుందా? ఏ రకమైన నిర్ణయం తీసుకుంటుందని అంశంపై కూడా తెలుగు రాష్ట్రాల్లో తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.
